Fun Bucket Bhargav: మైనర్ బాలికను గర్భవతిని చేసిన యూట్యూబర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
ABN , Publish Date - Jan 10 , 2025 | 09:59 PM
14 ఏళ్ల మైనర్ బాలికకు వెబ్ సిరీస్‌లో అవకాశం ఇస్తానని చెప్పి.. వీడియోలు చేయిస్తూ, ఆమెను మోసం చేశాడు యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్. అంతేకాకుండా ఆమెను లైంగికంగా వేధించి, గర్భవతి కావడానికి కారణమయ్యాడు. దీంతో 2021లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుపై విశాఖ పోక్సో కోర్టు కఠిన శిక్షను విధించింది.
14 ఏళ్ళ బాలికతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, ఆమె గర్భం దాల్చడానికి కారణమైన యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్‌కు విశాఖ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 4 లక్షల జరిమానా కూడా విధించింది. దీంతో సదరు యూట్యూబర్‌కి తగిన శాస్త్రి జరిగిందంటూ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఫన్ బకెట్ భార్గవ్ ఫేమస్ యూట్యూబర్. ఆయన యూట్యూబ్‌లో పోస్ట్ చేసే వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.
Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ
టిక్ టాక్‌తో ఫేమస్ అయిన ఫన్ బకెట్ భార్గవ్.. ఆ తర్వాత యూట్యూబ్ స్థాపించి అందులో వీడియోలు పోస్ట్ చేస్తూ.. మంచి ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత 14 ఏళ్ల మైనర్ బాలికకు వెబ్ సిరీస్‌లో అవకాశం ఇస్తానని చెప్పి.. వీడియోలు చేయిస్తూ, ఆమెను మోసం చేశాడు. అంతేకాకుండా ఆమెను లైంగికంగా వేధించి, గర్భవతి కావడానికి కారణమయ్యాడు. దీంతో 2021లో పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫన్ బకెట్ భార్గవ్‌పై ఫిర్యాదు చేశారు. భార్గవ్‌పై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
2021లో నమోదైన ఈ కేసుపై తాజాగా విశాఖ కోర్టు కఠినంగా శిక్షను విధించింది. సదరు యూట్యూబర్‌పై బాధితురాలే కాకుండా.. తనతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేసిన మరికొందరు కూడా భార్గవ్ ఆగడాల గురించి తెలిపారు. సదరు బాధితురాలిని కూడా చెల్లి అని పిలిచేవాడని, అలా పిలుస్తూనే ఆమెను లైంగికంగా వేధించాడని తెలిసి కోర్టు కూడా తీవ్రంగా రియాక్టైంది.