Swathi Mutyam: 40 మంది జర్నలిస్టులకు చిరు సత్కారం
ABN , Publish Date - Apr 29 , 2025 | 12:18 PM
స్వాతిముత్యం సంస్థ పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులను ఈ సంస్థ అధినేత ధీరజ అప్పాజీ సత్కరించారు.
తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ సౌజన్యంతో ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ ధీరజ అప్పాజీ సారధ్యంలో 'స్వాతిముత్యం' (Swathi Mutyam) సినీ, సాంస్కృతిక, సాహిత్య, సామాజిక సేవాసంస్థ సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, పి.ఆర్.ఒ.ల సత్కార కార్యక్రమం సోమవారం హైదరాబాద్ లోని తెలుగు నిర్మాతల మండలి (Telugu Film Producers' Council) సమావేశ మందిరంలో జరిగింది.
ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా మురళీమోహన్ (Murali Mohan), ఎమ్మెల్సీ సురభి వాణి దేవి (Surabhi Vani Devi), ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షులు కె. ఎస్. రామారావు (K.S. Ramarao), తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె. ఎల్. దామోదర్ ప్రసాద్ (K.L. Damodara Prasad), ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్ (Thummala Prasanna Kumar), బ్రహ్మశ్రీ ఎల్. వి. గంగాధర్ శాస్త్రి (L.V. Gangadhara Sastry), గిడుగు కాంతికృష్ణ, ప్రముఖ దర్శకనిర్మాత కూచిపూడి వెంకట్ (Kuchipudi Venkat), ఫిల్మ్ జర్నలిస్ట్ టర్నడ్ లిరిసిస్ట్ భాస్కరభట్ల రవికుమార్, మిమిక్రి లెజండ్ రమేష్, పాకలపాటి విజయవర్మ, ప్రొడ్యూసర్ బజార్ విజయ్, సెల్సియస్ సిస్టమ్స్ - హోమ్ ఎలివేటర్స్ శ్రీనివాస్, సినేటరియా వెంకట్, తెలుగుప్లెక్స్ వెబ్ సైట్ సీఈవో, ఎన్నారై కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సుమారు నలభై మంది సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, పి.ఆర్.ఓ.లను ఒకే వేదికపైకి తెచ్చి ఆత్మీయ సత్కారం తలపెట్టిన 'స్వాతిముత్యం' అప్పాజీని అతిధులు అభినందించారు. సీనియర్ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, పి.ఆర్.ఓ.లతో తమకు గల అనుబంధాన్ని వారంతా ఎంతో ఇష్టంగా గుర్తు చేసుకున్నారు.
Also Read: Mega Star: చిరు... పవన్... మధ్యలో చెర్రీ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి