TV: బుల్లితెర నటి వేధింపుల కేసులో వ్యక్తి అరెస్ట్
ABN , Publish Date - Jan 02 , 2025 | 05:14 PM
గత యేడాది సెప్టెంబర్ లో శ్రావణసంధ్య సీరియల్ లో నటిస్తున్న ఓ బుల్లితెర నటిపై యువకుడు వేధింపుల కేసు కలకలం రేపింది. తాజాగా ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
టీవీ సీరియల్ నటి వేధింపుల కేసులో యువకుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రావణ సంధ్య అనే టీవీ సీరియల్లో నటిస్తున్న మహిళను అదే యూనిట్లో పనిచేస్తున్న బత్తుల ఫణితేజ వేధింపులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇటీవలే రోజూ ఫోన్‌చేసి, అసభ్యకరంగా మేసేజ్‌లు పెడుతూ వేధిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లాకు చెందిన మహిళ సీరియల్స్‌లో నటిస్తుంది. 2012లో ఆమెకు వివాహం కాగా, కుమార్తె, కుమారుడు పుట్టిన తర్వాత పిల్లలతో కలిసి భర్తకు దూరంగా యూసుఫ్‌గూడ కృష్ణానగర్(Yusufguda Krishnanagar)లో నివాసముంటుంది. గత యేడాది సెప్టెంబర్ లో శ్రావణసంధ్య సీరియల్(Shravan Sandhya Serial)లో నటిస్తుండగా బత్తుల ఫణితేజ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.
కొద్ది కాలానికి ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పగా నిరాకరించింది. తనకు పెళ్లి అయి ఇద్దరు పిల్లలున్నారని చెప్పినా వినిపించుకోకుండా వెంటపడి వేధింపులకు పాల్పడ్డాడు. షూటింగ్ లో తాను ఇతర సినీనటులతో దిగిన ఫొటోలను బ్యానర్ల కిందవేసి సంక్రాంతికి మీ సొంత ఊర్లో కడతానని బెదిరించాడు. రోజుకు వందకుపైగా ఫోన్‌కాల్స్, వందలకుపైగా అసభ్యకరమైన మెస్సెజ్‌లు పెడుతూ వేధించసాగాడు. బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఫణితేజపై 75(2),78(2), 79,351(2) బీఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.