Tollywood Director: వాట్సప్‌తోనే వావ్ అనిపించుకున్న తెలుగు దర్శకుడు.. ఎవరో తెలుసా?

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:35 AM

వాట్సప్‌తోనే వావ్ అనిపించుకున్నాడో తెలుగు దర్శకుడు. ‘త్రివిక్రమన్’ అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన ఈ దర్శకుడి సూచనను వాట్సప్ టీమ్ తీసుకోవడంతో.. సదరు దర్శకుడు వార్తలలో నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరా దర్శకుడు అని అనుకుంటున్నారు కదా.. ఆ వివరాల్లోకి వెళితే..

Cheruku Kranti Kumar

వాట్సప్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ప్రజల వాడే యాప్. ఒకరి నుండి మరొకరికి సంబంధాలు సమాచారం చేరవేసుకునే వాట్సప్‌లో ‘వావ్’ అనే సంక్షిప్త సందేశం ప్రతిరోజూ కోట్లాదిమంది ఏదో ఒక సందర్భంలో అందుకుంటూనే ఉంటారు. అలాంటిది... సాక్షాత్తు ‘వాట్సప్’ సంస్థ నుంచే ‘వావ్’ అనే కితాబు అందుకున్నాడో తెలుగు దర్శకుడు. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఏమా కథ అనుకుంటున్నారా?

ఆ దర్శకుడు ఎవరో కాదు.. చెరుకు క్రాంతి కుమార్. ఈ యువ దర్శకుడు చేసిన ఒక అద్భుతమైన సూచనతో ‘ఈవెంట్’ అనే కొత్త ఫీచర్‌ను వాట్సప్ తీసుకొచ్చింది. ఈ సూచన చేసిన చెరుకు క్రాంతి కుమార్‌కు వాట్సప్ సంస్థ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, గెట్ టుగెదర్స్ వంటి ఈవెంట్స్‌ను పదేపదే గుర్తు చేసే బాధ్యతను ఇకపై వాట్సప్‌లో ఈవెంట్ అనే సరికొత్త ఫీచర్ తీసుకుంటుంది. ఈ ఫీచర్ రూపకర్తగా వాట్సప్ చరిత్రలో చెరుకు క్రాంతి కుమార్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాట్సప్ వంటి ఓ దిగ్గజ సంస్థ తన సూచనను స్వీకరించడం తనను సంభ్రమాశ్చర్యర్యాలకు గురిచేసిందంటున్నాడు క్రాంతి కుమార్.


Also Read-Daaku Maharaaj: అయ్యబాబోయ్.. ‘డాకు మహారాజ్’ ట్విట్టర్ టాక్ ఇలా ఉందేంటి?

ఆయన మాట్లాడుతూ.. వాట్సప్‌కు గల కోట్లాది వినియోగదారుల్లో ఒకడినైన నేను చేసిన సూచన మేరకు.. ఒక కొత్త ఫీచర్‌ను ఆ టెక్ జయింట్ తీసుకురావడం.. తన వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించాలనే సదరు సంస్థ తపనకు, నిబద్ధతకు నిదర్శనంగా చెప్పవచ్చని క్రాంతి పేర్కొన్నాడు. భవిష్యత్తులోనూ తన బుర్రకు పదును పెట్టి.. ఇటువంటి సలహాలు ఇచ్చేందుకు ఈ గుర్తింపు తనకు ఎంతో ప్రేరణ ఇస్తుందని తెలిపాడు. సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన చెరుకు క్రాంతి కుమార్.. సినిమాల పట్ల తనకు గల ప్యాషన్‌తో సినీరంగ ప్రవేశం చేసి.. తొలిచిత్రం ‘త్రివిక్రమన్’తో దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు. అతని తదుపరి చిత్రం ‘పీప్ షో’ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రియుడు ‘ఎఐ’ పేరుతో ఓ పుస్తకం ప్రచురించనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఓ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రి-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నానని, అతి త్వరలో అధికారికంగా ఆ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడిస్తామని ఈ యువ దర్శకుడు చెప్పుకొచ్చారు.


Also Read-Allu Arjun: బన్నీ మాస్టర్ ప్లాన్.. ఇక ఆపేవాడే లేడు

Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ

Also Read- Brahmanandam: హాస్య'బ్రహ్మ'పై దాడి


-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 13 , 2025 | 12:35 AM