Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో షాకింగ్ ట్విస్ట్..

ABN , Publish Date - Jan 01 , 2025 | 09:40 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై షాకింగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ ఘటనలో ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేయగా.. మధ్యంతర బెయిల్‌తో ఆయన విడుదలయ్యారు. ఆ తర్వాత ఈ కేసు టాలీవుడ్ టార్గెట్ అనేలా అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది. ఇప్పుడు నెలకొన్ని ట్విస్ట్ ఏంటంటే..

Sandhya Theatre Stampede

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’ ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై అల్లు అర్జున్‌ని, థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయగా.. మధ్యంతర బెయిల్‌తో వారు విడుదలయ్యారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై సీరియస్ అవుతూ.. అసెంబ్లీ సాక్షిగా ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచుకోవడాలు ఉండవంటూ ఆర్డర్ జారీ చేశారు. అంతకు ముందు పోలీసులు కొన్ని వీడియోలను విడుదల చేసి.. ఈ ఘటనకు అల్లు అర్జునే ఎలా కారణమయ్యాడో వివరించారు. అయితే ఇప్పుడీ ఘటనపై NHRC నోటీసులు జారీ చేసింది. ఎవరికో తెలుసా..

Also Read-Game Changer: ‘గేమ్ చేంజ‌ర్‌’ సెన్సార్ పూర్తి.. సర్టిఫికేట్ ఏం వచ్చిందో తెలుసా..


సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటపై నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్ సీపీకి NHRC నోటిసులు జారీ చేసింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీనియర్ ర్యాంక్ పోలీసు అధికారితో విచారణ జరపాలని, దీనిపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దీంతో ఇప్పటి వరకు అల్లు అర్జున్ టార్గెట్‌గా ఉన్న ఈ కేసు.. ఇప్పుడు పోలీసుల వైపు టర్న్ తీసుకుంది. మరి NHRC నోటిసుల నేపథ్యంలో డీజీపీ, హైదరాబాద్ సీపీ ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాల్సి ఉంది. కాగా, ఈ ఘటనలో ఇప్పటికే హీరో అల్లు అర్జున్, థియేటర్ యాజమాన్యం, సెక్యూరిటీ మేనేజర్, పుష్ప-2 నిర్మాతలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.


సంధ్య థియేటర్ వద్ద అసలేం జరిగిందంటే..

తెల్లవారితే పుష్ప-2 సినిమా విడుదలవుతుందనగా.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో వేయడం, ఆ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి(35) మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్‌ అపస్మారక స్థితికి చేరుకొని చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వీరితోపాటు తొక్కిసలాటలో మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు థియేటర్‌ యాజమాన్యం నిర్లక్ష్యంతోపాటు.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రీమియర్‌ షో వీక్షించడానికి హీరో అల్లు అర్జున్‌ రావడం కూడా కారణమని పోలీసులు భావించారు. దీనిపై అల్లు అర్జున్‌పై కేసు నమోదవ్వగా పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరిచారు. ఆ తర్వాత మధ్యంతర బెయిల్‌తో అల్లు అర్జున్ విడుదలయ్యారు. ప్రస్తుతం ఈ కేసులో బెయిల్ కోసం అల్లు అర్జున్ ప్రయత్నిస్తున్నారు.


Also Read-కాశీ యాత్రలో రేణు దేశాయ్, అకీరా, ఆద్య.. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్

Also Read-Prabhas: తెలంగాణ ప్రభుత్వానికి రెబల్ స్టార్ ప్రభాస్ సపోర్ట్

Also Read-Dil Raju: సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ కామెంట్స్‌కు దిల్ రాజు స్పందనిదే..

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 01 , 2025 | 09:40 PM