హైదరాబాద్‌లో సౌదీ ఫిలిమ్ నైట్స్ - సౌదీ ఫిలిమ్స్ ప్రదర్శన.. లక్ష్యమిదే!
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:11 PM
సౌదీ అరేబియా, భారతదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాల ప్రదర్శన నిర్వహించినట్లుగా డోమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత మహమ్మద్ మొరాని తెలిపారు. సౌదీ ఫిలిం కమిషన్ నిర్మించిన చిత్రాలను బంజారాహిల్స్‌లో ఆర్కే పివిఆర్‌లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందనతో నిర్వాహకులు తమ సంతోషాన్ని తెలియజేశారు.
విలక్షణ కథాంశాలతో సౌదీ ఫిలిం కమిషన్ నిర్మించిన చిత్రాలను బంజారాహిల్స్‌లో ఆర్కే పివిఆర్‌లో ప్రదర్శించారు. సౌదీ అరేబియా, భారతదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చిత్రాల ప్రదర్శన నిర్వహించినట్లుగా డోమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాత మహమ్మద్ మొరాని తెలిపారు. డోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, కళారాజ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమం అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు.. పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరై లఘు చిత్రాలను వీక్షించి నందుకు డోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, కళారాజ్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read- Sankranthiki Vasthunam OTT: ఓటీటీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' ఎక్కడ, ఎప్పుడంటే..
ఈ కార్యక్రమంలో మహమ్మద్ మొరానీ, లక్కీ మొరానీ, మజర్ నదియాడ్‌వాలా, మిస్టర్ అలీమ్ మొరానీ వంటి వారు అతిథుల్ని ఘనంగా స్వాగతించారు. సౌదీ ఫిల్మ్ నైట్స్ - సౌదీ సినిమా కళాత్మక నైపుణ్యతను హైలైట్ చేస్తూ సౌదీ అరేబియా, భారతదేశం మధ్య సాంస్కృతిక బంధాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని వీక్షకులంతా ఎంతగానో ప్రశంసించారు.
Also Read- Oka Pathakam Prakaaram Review: 'ఒక పథకం ప్రకారం' పూరీ తమ్ముడికి హిట్ ఇచ్చిందా..
ఈ కార్యక్రమం ద్వారా సౌదీ చలనచిత్ర నిర్మాణం, వారి నైపుణ్యతను అందరికీ తెలియజేయడమే కాకుండా.. సౌదీ, భారతీయ చలనచిత్ర పరిశ్రమల మధ్య సినిమా సంబంధాలను మరింత బలోపేతం చేసి.. రెండు దేశాల మధ్య భవిష్యత్తులో సహకారానికి మార్గం సుగమం చేసేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కార్యక్రమ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు సైతం హాజరై, తమ ఆనందాన్ని తెలియజేశారు.