Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్.. ఆ మీటింగ్‌కు కష్టమే!
ABN , Publish Date - Feb 05 , 2025 | 06:49 PM
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన వైరల్ ఫీవర్‌తో పాటు, స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నట్లుగా డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్స్ ఏం చెప్పారంటే..
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఈ మధ్యకాలంలో తరుచూ ఆయన అనారోగ్యానికి గురవుతున్న విషయం తెలిసిందే. నిరంతరం ప్రజలలో ఉంటూ, ప్రజల అవసరాలను తీర్చుతూ వస్తున్న పవన్ కళ్యాణ్.. మరోసారి వైరల్ ఫీవర్ బారిన పడినట్లుగా డిప్యూటీ సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. వైరల్ ఫీవర్‌తో పాటు స్పాండిలైటిస్‌తో ఆయన బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆయనని పరీక్షించిన డాక్టర్లు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది కానీ.. ఆయనకు విశ్రాంతి చాలా అవసరమని సూచించినట్లుగా సమాచారం. దీంతో, గురువారం నాటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోచ్చని అధికారులు చెబుతున్నారు.
Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..
మరోవైపు రాజకీయాలతో పాటు ‘హరిహర వీరమల్లు’ షూట్‌లోనూ ఆయన పాల్గొంటున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ పాల్గొనే ఆఖరి షెడ్యూల్ బుధవారం నుండి ప్రారంభం అవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కానీ వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ఆయన.. ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనే అవకాశం లేదని తెలుస్తుంది. అందులోనూ చాలా కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరపాల్సి ఉండటంతో, పవన్ కళ్యాణ్ ఆరోగ్యం అందుకు సహకరించదని, ఆయనకు విశ్రాంతి చాలా అవసరమని డాక్టర్స్ సూచించినట్లుగా సమాచారం.