NBK: పదవులు మనకు అలంకారం కాదు.. మనమే ఆ పదవులకు అలంకారం కావాలి

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:30 PM

నటసింహం బాలయ్యను ‘పద్మ భూషణ్’ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. ఈ అవార్డు ప్రకటన వచ్చినప్పటి నుండి బాలయ్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా బాలయ్యకు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ టీమ్ భారీగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Nandamuri Balakrishna

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాలలో నందమూరి నటసింహం బాలయ్యకు ‘పద్మ భూషణ్’ పురస్కారం వరించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, ఇండస్ట్రీ పర్సన్స్, ఆయన నియోజక వర్గ ప్రజలు అందరూ కూడా.. బాలయ్య ఈ అవార్డుకి అర్హుడు అనేలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలయ్య ఈ పురస్కారం వచ్చిన సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ టీమ్ బాలకృష్ణ దంపతులకు భారీ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ..


Also Read- Kumbh Mela Monalisa: ‘కుంభమేళా’ మోనాలిసా ఇంటికి వెతుక్కుంటూ వచ్చిన అదృష్టం.. రీల్స్‌ నుండి రియల్ తెరకు!

‘‘మీ అందరి సంతోషం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ‘పద్మ భూషణ్’ నన్ను వరించింది. పదవులు మనకు అలంకారం కాదు.. మనమే ఆ పదవులకు అలంకారం కావాలి. నేను ఎప్పుడూ, ఏదీ ఆశించి చేయలేదు. ఇది మా నాన్న గారి ఆశీర్వాదం. ఇలాంటి సన్మానాలు మనలో బాధ్యతను పెంచుతాయి. నాకు వచ్చిన ఈ అవార్డు నా క్షేమం కోరుకునే వారందరికీ వచ్చినట్లే. ఈ రోజు నాకు వచ్చిన ఈ అవార్డు రేపు మీకు రావచ్చు. సొంత లాభం కొంత మానుకుని సమాజం కోసం పని చేయండి. ఈ మధ్యకాలంలో నేను నటించిన నాలుగు సినిమాలు వరసగా హిట్ అవటం, అలాగే వరసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం, ఇప్పుడు ఈ అవార్డు రావడం సంతోషించదగినవి. నా కుటుంబం అయిన బసవతారకం హాస్పిటల్ టీమ్, హిందూపూర్ నియోజకవర్గం ప్రజలు వారికి అవార్డు వచ్చినట్లు భావిస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యం అయితే ఇలాంటి కుటుంబం దొరుకుతుంది.


Also Read- Kiss Scene: ఆ ముద్దు సీన్ ట్రిమ్ చేశారు.. పాపం పూజా హెగ్డే?

కాలం మారుతుంది క్యాన్సర్ పెరుగుతుంది.. దానికి తగ్గట్లుగా మనం పయనించాలి కొత్త మెష్నీరిస్‌‌కి స్వాగతం పలకాలి. మా అమ్మగారి ఆశయం కోసం ఎంతో మందికి తక్కువ ఖర్చు‌తో వైద్యం చేస్తున్నాం. ఈ గొప్ప కార్యక్రమానికి సహకారం అందిస్తున్న దాతలకి, ప్రభుత్వాలకి, బ్యాంకర్స్‌కి కృతజ్ఞతలు. కళారంగానికి చేసిన సేవలు మరువలేనిది.. దానికి గుర్తింపే ఈ గొప్ప అవార్డు. మేము ఏ సినిమా చేసినా ఎంతో ఆలోచించి చేస్తాం. ఈ అవార్డు మా అమ్మనాన్నలకు అంకితం. మా నాన్నగారు ఎన్నో సేవలు చేశారు. ఆయనకి భారతరత్న రావాలి.’’ అని చెప్పుకొచ్చారు.


Also Read- Kollywood Directors: కోలీవుడ్‌ డైరెక్టర్లు.. భయపడుతున్న టాలీవుడ్‌ హీరోలు!

Also Read- Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2 రీ లోడెడ్’.. నీ యవ్వ ఇక తగ్గేదే లే..

Also Read- Raghava Lawrence Kanchana 4: ‘కాంచన 4’.. కత్తిలాంటి ఫిగర్‌ని పట్టిన లారెన్స్

Also Read- సచిన్ కుమార్తె.. సామాన్యమైనది కాదండోయ్!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 31 , 2025 | 01:32 PM