Padma Bhushan Puraskar 2025: బాలయ్యతో పాటుగా పద్మ భూషణ్ పొందిన నటులెవరంటే..

ABN , Publish Date - Jan 25 , 2025 | 10:28 PM

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో బాలయ్యతో పాటు మరికొందరు సెలబ్రిటీలను ‘పద్మ భూషణ్’ వరించింది. వారెవరు, ఏ రాష్ట్రం తరపున వారు నామినేట్ అయ్యారు అనే వివరాల్లోకి వెళితే..

Balayya and Ajith Kumar

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. అనేక రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఈ పద్మ అవార్డులలో ఏడుగురికి పద్మ విభూషణ్‌, 19 మందికి పద్మ భూషణ్‌, 113 మందికి పద్మ శ్రీ పురస్కారాలు వరించాయి. ఏపీ నుంచి కళల విభాగంలో నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్‌ పురస్కారం వరించగా.. ఆయనతో పాటు మరికొందరు నటులనూ ఈ పురస్కారం వరించింది. ఆ నటులెవరంటే..


Anant-Nag.jpg

అనంత నాగ్: (కెజియఫ్ ఫేమ్)

కెజియఫ్ పార్ట్ 1లో కథని నడిపించిన సీనియర్ నటుడు అనంత నాగ్‌‌ను పద్మభూషణ్ వరించింది. కర్ణాటక రాష్ట్రం ఆయనని ఈ పురస్కారానికి నామినేట్ చేసింది. 1948లో పుట్టిన అనంత్ నాగ్ కన్నడ నటుడిగా గుర్తింపు పొందారు. 200కి పైగా కన్నడ చిత్రాలలో నటించిన ఆయన.. కన్నడతో పాటు హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళం మరియు ఆంగ్ల చిత్రాలతో సహా మొత్తం 300కి పైగా చిత్రాలలో నటించారు. సినిమాలతో పాటు థియేటర్ నాటకాలు, టెలివిజన్ షోలలోనూ ఆయన నటించారు.

Also Read- Padma Bhushan Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్


Ajith-Kumar.jpg

అజిత్ కుమార్:

సౌత్ ప్రేక్షకులకు అజిత్ పేరు బాగా పరిచయమే. ఇటీవల అజిత్ కుమార్ 24H దుబాయ్ 2025 ఎండ్యూరెన్స్ రేస్‌లో థ్రిల్లింగ్ విజయాన్ని సాధించారు. హోరా హోరీగా జరిగిన ఈ పోటీల్లో ఆయన టీమ్‌ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు సినిమాలతోనూ ఆయన ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన సినిమాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. తనకు అభిమానులు అవసరం లేదని, తనని అభిమానించవద్దని చెప్పే అజిత్.. ఎప్పుడు ఖాళీ దొరికినా రైడర్‌గా తన ఇష్టాన్ని తెలియజేస్తూనే ఉంటారు. తమిళనాడు రాష్ట్రం ఆయనని పద్మ భూషణ్ పురస్కారానికి నామినేట్ చేసింది.

Also Read- Akhanda 2 Thandavam Heroine: ప్రగ్యా జైస్వాల్ ఏమైంది.. ఇదేం ట్విస్ట్ బోయపాటి?


Shobana.jpg

నటి శోభన:

1980లలో భారతదేశంలో ప్రతిభావంతులైన కళాకారిణులలో శోభన ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సినిమాలలో నటించిన శోభన, అందంలోనూ అలాగే నటనలోనే కాకుండా నాట్యంలో కూడా అద్భుతంగా రాణించారు. ఆమె చెన్నై లోని చిదంబరం నాట్య అకాడెమీలో శిక్షణ పొందారు. భరత నాట్యంలో ఎంతో ముఖ్యమైన అభినయాన్ని ప్రదర్శించడంలో శోభన దిట్ట. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఆమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటున్నారు. కళా విభాగంలో తమిళనాడు రాష్ట్రం ఆమెని పద్మ భూషణ్ పురస్కారానికి నామినేట్ చేసింది. ఇంకా ఆర్ట్ విభాగంలో జతిన్ గోస్వామి (అస్సాం), పంకజ్ ఉదాస్ (మహారాష్ట్ర), శేఖర్‌ కపూర్‌ (మహారాష్ట్ర)‌లను పద్మ భూషన్ వరించింది.


Also Read- SSMB29 Memes: మహేశ్‌పై మీమ్స్‌.. ప్రియాంక ఫిక్స్‌

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 25 , 2025 | 10:28 PM