Nidhhi Agerwal: నాకు పెళ్లి అంటూ వస్తున్న వార్తలను దయచేసి నమ్మవద్దు
ABN , Publish Date - Feb 08 , 2025 | 10:51 PM
నిధి అగర్వాల్.. ప్రేక్షకులకు ఈ పేరుని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా.. తన గ్లామర్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామపై.. పెళ్లి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలను నిధి అగర్వాల్ ఖండించారు.
తన పెళ్ళి గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దు అంటూ హీరోయిన్ నిధి అగర్వాల్ విఙ్ఞప్తి చేశారు. తెలుగు, తమిళ చిత్రాలతో బిజీ హీరోయిన్‌గా మారిన నిధిపై రీసెంట్‌గా పెళ్లి వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ వార్తలను ఆమె ఖండించింది. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె.. రవి మోహన్ నటించిన ‘భూమి’ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ తర్వాత శింబుతో ‘ఈశ్వరన్’, ఉదయనిధితో ‘కళగ తలైవన్’ సినిమాల్లో నటించారు. ఆ తర్వాత ఒక్క తమిళ చిత్రంలోనూ నటించలేదు. నిధి అగర్వాల్ తమిళ్‌లో సినిమాకు సంతకం చేసి మూడేళ్ళు అయింది. దీనికి కారణం లేకపోలేదు.
Also Read- Chiranjeevi: ఓ మహిళ చెడమడా తిట్టేశారు.. ఎవరా అని ఆరా తీస్తే?
తెలుగులో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’, రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ పాన్ ఇండియా మూవీల్లో నటిస్తున్నారు. ఈ రెండు మూవీలు ఈ యేడాది ప్రేక్షకుల ముందుకురానున్నాయి. ‘హరిహర వీరమల్లు’ మూవీలో నటించేందుకు ఒప్పందంపై సంతకాలు చేసే ముందు.. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు మరో సినిమాలో నటించకూడదన్న షరతుకు అంగీకరించారు. ఫలితంగా నిధి అగర్వాల్ మూడేళ్ళుగా మరో కొత్త చిత్రంలో నటించలేని పరిస్థితి నెలకొంది.
Also Read- Akhanda 2 Thandavam: ‘అఖండ 2: తాండవం’కి విలన్‌గా ‘సరైనోడు’ పడ్డాడులే..
అదే సమయలో నిధి అగర్వాల్ పెళ్ళి చేసుకోబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. దీన్ని ఆమె తోసిపుచ్చారు. ఇలాంటి ప్రచారాన్ని దయచేసి నమ్మవద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం తన ధ్యాసంతా నటిగా సరికొత్త పాత్రలు చేసేపైనే ఉందని, కావాలని కొందరు పెళ్లి అంటూ వార్తలు పుట్టిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. త్వరలోనే తన నూతన ప్రాజెక్ట్‌ల ప్రకటన వస్తుందని తెలిపారు.