Koi Koi Viral Song Singer: పాట మీనింగ్ తెలుసుకుని మాట్లాడండి.. కోయి కోయి వైరల్ సాంగ్ సింగర్ మీసాల గుర్రప్ప!
ABN , Publish Date - Jan 23 , 2025 | 09:17 PM
Koi Koi Song Singer Meesala Gurrappa: పోయిన సంవత్సరం క్రిస్మస్ నుండి ‘కోయారే కోయి కోయి కోయా’ పాట ఎంతగా వైరల్ అవుతుందో.. సోషల్ మీడియాని చూస్తే తెలుస్తోంది. ఈ పాటతో అందరూ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో వదులుతున్నారు. అదే సమయంలో ఈ పాటపై విమర్శలు చేసేవారు లేకపోలేదు. అలాంటి విమర్శకులు చేసే వారందరికీ ఈ పాట పాడిన సింగర్ ఏం చెప్పారంటే..
Meesala Gurrappa: లాస్ట్ ఇయర్ క్రిస్మస్ టైమ్‌లో చర్చిలో ఓ పాస్టర్ పాడిన పాట ఎంతగా వైరల్ అయిందో.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి బాగా తెలుసు. అతనేం పెద్ద సింగర్ కాదు. కానీ, ఈ పాస్టర్ నార్మల్‌గా పాడిన ‘కోయారే కోయి కోయి కోయా’ పాట బీభత్సంగా ట్రెండ్ అవుతూ.. అంతా ఈ సింగర్ గురించి మాట్లాడుకునేలా చేస్తుంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా సెలబ్రిటీలు సైతం ఈ పాటపై రీల్స్ చేస్తుండటం చూస్తుంటే ఎంతగా ఈ సాంగ్ జనాల్లోకి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ పాట పైకి ఎంజాయ్ చేసేదిగా అనిపిస్తున్నా.. పాట వెనుక ఎంతో ఆవేదన ఉంది. ఇంతకీ ఈ పాట పాడిన సింగర్ పేరు చెప్పలేదు కదా.. ‘మీసాల గుర్రప్ప’. ఈ పాట వెనుక కథ, తన ఆవేదన ఏంటనేది తాజాగా ఆయన ABN ఆంధ్రజ్యోతికి వివరించారు.
Also Read- Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..
ముందుగా ‘మీసాల గుర్రప్ప’ విషయానికి వస్తే.. ఆయన ఒకప్పటి ఆదివాసి.. అడవి బిడ్డ. ఒకప్పటి విషపు మనిషి కూడా. ఆదివాసీ ప్రాంతాల్లో మహిళ సంరక్షణ కోసం విషపు మనిషిగా జీవించారు గుర్రప్ప. అడవి ప్రాంతాల్లోని ఆడబిడ్డల రక్షణ నిమిత్తం తనని అంతా విషపు మనిషిగా మార్చారని చెబుతున్న గుర్రప్ప.. ఈ పాట పాడడానికి గల కారణమేంటో తెలిపారు. ఆయన మాట్లాడుతూ..
అంతరించిపోతున్న, వెనుకబడిన ఈ భాషని ఎవరు పైకి తీసుకువస్తారు.. అని మా జాతి, మా నాన్న, మా బంధువులంతా ఎంతో ఆవేదన చెందుతున్న సమయంలో.. నేను ఎలాగైనా నా భాషని పైకి తీసుకురావాలని నేను నమ్ముకున్న నా దేవునికి ప్రార్థన చేసి ఈ పాట రాశాను. ఈ పాట ఇంతగా ప్రజలలోకి వెళ్లడంతో మా కులపెద్దలందరూ నన్ను అభినందించారు. పూలదండలతో సన్మానం కూడా చేశారు. కొంతమంది పాస్టర్స్‌కి మా భాష తెలియదు, ఆ పాటకి అర్థం తెలియక ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు. పాట మొత్తం ఆదివాసీ భాషలోనే పాడాను. 10, 15 కులాలకు చెందిన భాష ఇది. ఈ పాటలో వ్యక్తిగతంగా నేను ఎవరినీ దూషించలేదు. అలాగే ఎటువంటి బూతు పదాలకు తావివ్వలేదు. కేవలం దేవుడిని స్తుతించండి అని చెప్పేలానే ఉంటుంది. నన్ను ఇబ్బంది పెట్టాలని ఆ పాటను వైరల్ చేశారు.. అదే నాకు మంచి చేసింది. ఒక్కసారి ఆ పాటలో ఉన్న అర్థం అందరూ తెలుసుకోండి.. అంటూ ఆ పాటలోని ఒక్కో పదానికి ఉన్న అర్థాన్ని మీసాల గుర్రప్ప చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన ఏం చెప్పారో పై వీడియోలో చూడండి..