Janhvi Kapoor: వెండితెర నుండి వెబ్ సీరిస్ కు....
ABN , Publish Date - Apr 24 , 2025 | 09:38 AM
అందాల సుందరి, స్వర్గీయ శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పుడో తమిళ వెబ్ సీరిస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పా. రంజిత్ తెరకెక్కించే వెబ్ సీరిస్ లో జాన్వీ నటించబోతోందట.
'దేవర' (Devara) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan) హీరోగా రూపుదిద్దుకుంటున్న 'పెద్ది' (Peddi) లో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే 'దేవర' రెండో భాగంలోనూ ఆమె నటించాల్సి ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించి, తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న జాన్వీ కపూర్ ఏ మీడియం అనే ఆలోచన లేకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర ఎందులో దొరికినా చేస్తోంది. జాన్వీ నటించిన కొన్ని సినిమాలు థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటీటీలోనూ సందడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అలానే ఇప్పుడు వెబ్ సీరిస్ కూ జాన్వీ జై కొట్టినట్టు తెలుస్తోంది. కెరీర్ ప్రారంభంలోనే జాన్వీ గోస్ట్ స్టోరీస్ (Ghost Stories) ఆంథాలజీలోనూ నటించింది.
ప్రముఖ తమిళ దర్శకుడు పా. రంజిత్ (Pa. Ranjith) సినిమాలకంటూ కొంతమంది అభిమానులు ఉన్నారు. అట్టడుగు వర్గాల వెతలను కథలుగా రాసుకుని పా. రంజిత్ వెండితెరపై ఆవిష్కరిస్తూ ఉంటారు. రజనీకాంత్ (Rajinikanth) సైతం పా. రంజిత్ దర్శకత్వంలో 'కబాలి (Kabali), కాలా' (Kaala) చిత్రాలలో నటించారు. పా. రంజిత్ ఇప్పుడు ఓ వెబ్ సీరిస్ తీయబోతున్నారు. మహిళలకు సంబంధించిన సామాజిక సమస్యలు, వారి అణచివేత నేపథ్యంలో ఈ వెబ్ సీరిస్ ఉండబోతోందట. మహిళా ప్రాధాన్యత కలిగిన ఈ వెబ్ సీరిస్ నటించమని జాన్వీని పా, రంజిత్ కోరాడని, ఆమె కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. జులై లో దీని చిత్రీకరణ మొదలవుతుందని అంటున్నారు. ప్రస్తుతం జాన్వీ హిందీలో 'పరమ్ సుందరి, సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి' చిత్రాలలో నటిస్తోంది. సో... హిందీ నుండి తెలుగు మీదుగా జాన్వీ తమిళ రంగంలోకి కూడా అడుగుపెట్టినట్టే!
Also Read: NTR- ANR: నందమూరి - అక్కినేని అనుబంధం
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి