Nicholai Sachdev: వరలక్ష్మి శరత్‌కుమార్ భర్త నికోలాయ్ సచ్‌దేవ్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

ABN , Publish Date - Jan 07 , 2025 | 10:49 PM

2024 సంవత్సరం పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలలో వరలక్ష్మీ శరత్ కుమార్ ఒకరు. అంతకు ముందు విశాల్‌తో పెళ్లి పీటల వరకు వెళ్లిన వరలక్ష్మీ శరత్ కుమార్ సడెన్‌గా పెళ్లి వద్దనుకుంది. ఆ తర్వాత కొంతకాలం కామ్‌గా ఉన్న ఆమె.. తనకు 14 సంవత్సరాలుగా తెలిసిన నికోలాయ్ సచ్‌దేవ్‌‌ని వివాహం చేసుకుంది. ఆమె పెళ్లాడిన నికోలాయ్ సచ్‌దేవ్‌‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

Varalaxmi Sarathkumar and Nikolai Sachdev

వరలక్ష్మీ శరత్ కుమార్ అందరికీ పరిచయమే. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ నటిగా కొనసాగుతున్న వరలక్ష్మీ.. ఇటీవల నికోలాయ్ సచ్‌దేవ్‌ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అంతకు ముందు విశాల్‌తో పెళ్లి పీటల వరకు వెళ్లిన వరలక్ష్మీ.. ఆ తర్వాత పెళ్లే చేసుకోనంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది. కానీ, తనకు 14 సంవత్సరాలుగా పరిచయం ఉన్న నికోలాయ్ సచ్‌దేవ్‌‌‌ని వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు అతను ఎవరో కూడా ఎవరికీ తెలియదు. సడెన్‌గా అనౌన్స్ చేసింది. అలా ప్రకటించిన కొన్ని రోజులలోనే నికోలాయ్‌తో పెళ్లి పీటలు ఎక్కేసింది. దీంతో అతడు ఎవరని అంతా ఆమధ్య తెగ సెర్చ్ చేశారు. ఈ సెర్చింగ్ నికోలాయ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి. ఆ విషయాల్లోకి వెళితే..


నికోలాయ్ సచ్‌దేవ్ ముంబైకి చెందిన ఆర్ట్ గ్యాలరిస్ట్. అతను ముంబైలో ‘గ్యాలరీ 7’ అనే ఆర్ట్ గ్యాలరీని నడుపుతుంటారు. ఈ గ్యాలరీని చూసేందుకు తరుచుగా సెలబ్రిటీలు వెళుతుండటంతో.. ముంబైలోనే ప్రసిద్ధి చెందిన గ్యాలరీగా పేరు పొందింది. ప్రముఖ ఆర్ట్ గ్యాలరిస్ట్‌లైన నికోలాయ్ తల్లిదండ్రులు అరుణ్ మరియు చంద్ర ఈ ‘గ్యాలరీ 7’ని స్థాపించారు. ఇది కాకుండా.. నికోలాయ్ సచ్‌దేవ్ పవర్‌లిఫ్టర్ మరియు ఫిట్‌నెస్ నిపుణుడిగానూ పేరు పొందారు. అనేక పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఆయన విజేతగా నిలిచారు. అలాగే ఆయన టాటూ ప్రేమికుడు కూడా. ఆ విషయం ఆయనను చూస్తేనే తెలుస్తుంది.

Also Read-Ajith Kumar: రేసింగ్ సర్క్యూట్‌లో అజిత్ కారుకు ఘోర ప్రమాదం.. నుజ్జునుజ్జయిన కారు


ఇక నికోలాయ్‌కి అంతకు ముందే పెళ్లయింది. వరలక్ష్మీని రెండో వివాహం చేసుకున్నాడు నికోలాయ్. 2006లో మోడల్ మరియు ఫిట్‌నెస్ శిక్షకురాలైన కవితను నికోలాయ్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు కాషా అనే కుమార్తె కూడా ఉంది. కాషాకు కూడా నికోలాయ్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గానూ, పవర్‌లిఫ్టింగ్‌ శిక్షకుడిగానూ వ్యవహరించారు. ఫలితంగా ఆమె అనేక అవార్డులను సైతం గెలుచుకుంది. అయితే పెళ్లయిన 13 సంవత్సరాల అనంతరం నికోలాయ్, కవిత విడాకులు తీసుకున్నారు. 2019లో వీరి వివాహ బంధం పూర్తిగా ముగిసింది. అయితే అప్పటికే వరలక్ష్మీ, నికోలాయ్‌కి పరిచయం ఉండటంతో, వారి పరిచయం ప్రేమ వరకు వెళ్లి, చివరికి పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.


Also Read- Renu Desai: అలా ఎలా తీశారో.. ఆ సినిమా చూస్తూ ఏడ్చేశా..

Also Read- Naga Vamsi: తప్పుగా మాట్లాడలేదు.. వివాదంపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ

Also Read-Yearender 2024 ఆర్టికల్స్..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 07 , 2025 | 10:50 PM