Financier Sadanand: ‘పులి, ఖలేజా’లతో కోట్లు పోయాయన్న నిర్మాతపై ఫైనాన్సియర్ ఫైర్
ABN , Publish Date - Feb 07 , 2025 | 10:43 PM
‘కొమురం పులి, ఖలేజా’ చిత్రాల నిర్మాత శింగనమల రమేష్ బాబు రీసెంట్‌గా మీడియా సమావేశం నిర్వహించి.. కొన్ని ఆసక్తికర, కొన్ని సంచలన విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అవన్నీ అవాస్తవాలే అని, అతనొక మోసగాడు అంటూ.. రమేష్ బాబుకి ఫైనాన్స్‌కి డబ్బులిచ్చిన ఫైనాన్సియర్ మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఏమన్నారంటే..
శింగనమల రమేష్ బాబు పచ్చి మోసగాడు అని అన్నారు ఫైనాన్సియర్ వైజయంతి రెడ్డి భర్త సదానంద్. ఇటీవల ‘కొమరంపులి, ఖలేజా’ చిత్రాల నిర్మాత శింగనమల రమేష్ మీడియా సమావేశం నిర్వహించి తన భవిష్యత్ కార్యాచరణ్ గురించి తెలుపుతూ.. ఆ రెండు సినిమాలతో దాదాపు రూ. 100 కోట్లు లాస్ అయినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు, కొన్నాళ్లపాటు జైలులో ఉండి బెయిల్‌పై వచ్చిన ఆయన.. ఆ కేసులో ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదని వెల్లడించారు. ఆయన ప్రెస్ మీట్ అనంతరం.. ఆయనకు ఫైనాన్సియర్‌గా వ్యవహరించిన వైజయంతి రెడ్డి భర్త సదానంద్ శుక్రవారం ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. శింగనమల రమేష్ బాబు మోసాలు, బెదిరింపులు, అక్రమాస్తుల నిగ్గు తేల్చేందుకు మేము ఎంతదూరమైనా పోరాటం చేస్తామని ఆ చిత్రాలకు పెట్టుబడి పెట్టిన ఫైనాన్షియర్ వైజయంతి రెడ్డి తరపున ఆమె భర్త సదానంద్ స్పష్టం చేశారు.
Also Read- Sankranthiki Vasthunam OTT: ఓటీటీలోకి 'సంక్రాంతికి వస్తున్నాం' ఎక్కడ, ఎప్పుడంటే..
ఈ సందర్భంగా సదానంద్ మాట్లాడుతూ.. శింగనమల రమేష్ బాబు పచ్చి మోసగాడు. ఇటీవల హైదరాబాద్‌లో శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకుని.. అన్నీ అబద్దాలు చెప్పారు. మా దగ్గర ఫైనాన్స్ తీసుకుని, ఆ పెట్టుబడితో ‘కొమరంపులి, ఖలేజా’ సినిమాలను తీసి, తాను నష్టపోయాను అని అతను అవాస్తవాలు చెప్పారు. అంతేకాదు ఆ రెండు సినిమాల షూటింగులు జరిగేటప్పడు సూరి, భానుకిరణ్ వంటి ఫ్యాక్షనిస్టులతో పాటు ఎందరో రౌడీలు వచ్చి, లొకేషన్స్‌లో కూర్చునేవారు. దాంతో షూటింగులు చేసేందుకు హీరోలు, ఆరిస్టులు ఎలా వస్తారు. శింగనమల రమేష్ బాబు తప్పుడు విధానాలు, అలవాట్ల వల్లనే ఆ రెండు సినిమాల షూటింగ్స్ ఆలస్యం అయ్యాయి తప్ప హీరోలు, డైరెక్టర్స్ వల్ల కానేకాదు. వారివల్ల నష్టపోయినట్లు అతను ఆరోపించడంతో ఎంతమాత్రం వాస్తవం లేదు. అతను స్వయంకృతాపరాధంతోనే సినిమాలను రిలీజ్ చేయలేకపోతే సి.కళ్యాణ్ గారు సినిమాలను రిలీజ్ చేశారు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు శింగనమల రమేష్ బాబును చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలి.
Also Read- దర్శకుడిగా మారుతున్న ప్రముఖ దర్శకుడి తనయుడు.. ఎవరో తెలుసా?
సినిమాల రిలీజ్ తర్వాత మేము పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇవ్వమని శింగనమల రమేష్ బాబును అడిగితే, అతని రౌడీ గ్యాంగ్‌తో పాటు భానుకిరణ్, అతనికి చెందిన గ్యాంగ్ నా తలపై తుపాకి గురిపెట్టి చంపేస్తాం అంటూ బెదిరించారు. దాంతో అప్పట్లో మేము హైదరాబాద్ సీసీఎస్‌లో కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత సూరి చనిపోయిన తర్వాత సీసీఎస్‌లో మేము పెట్టిన కేసును సీఐడీకి బదిలీ చేయడం జరిగింది. శింగనమల రమేష్ బాబు తదితరులపై మేము పెట్టిన కేసును నాంపల్లి క్రిమినల్ కోర్టు ఇటీవల జనవరి 31వ తేదీన కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు దానిపై సీఐడీ వారితోపాటు మేము కూడా తెలంగాణ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్ళబోతున్నాం. అయితే దీనిపై శింగనమల రమేష్ బాబు ఇటీవల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడిన అంశాలలో మా కేసులోనే స్థలాలను ముగ్గురికి అమ్మానని చెప్పి, ఫలానా వ్యక్తి తనపై కేసు పెట్టినట్లుగా ఆయన చెప్పడంతో పాటు ఆ కేసులో నేను గెలిచాను అని అతను చెప్పారు.
Also Read- Oka Pathakam Prakaaram Review: 'ఒక పథకం ప్రకారం' పూరీ తమ్ముడికి హిట్ ఇచ్చిందా..
వాస్తవానికి మాకే కాదు ప్రొద్దుటూరుకు చెందిన ఇంకెందరో ఫైనాన్సియర్స్ దగ్గర సినిమాల కోసం శింగనమల రమేష్ బాబు ఫైనాన్స్ తీసుకుని వారందరికీ జవాబు చెప్పకుండా ఎగ్గొట్టి, తిరుగుతున్నాడు. దాదాపు 300 కోట్ల రూపాయల మేర డబ్బులు అతను ఇవ్వాల్సిన బాధితులు ఉన్నారు. ఫైనాన్సియర్స్ డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నైలలో అతను కుటుంబ సభ్యులు, ఇతర బినామీల మీద ఆస్తులు పెంచుకుని, ఫైనాన్సియర్స్‌ను మోసం చేసి, అడిగినవారిని చంపేస్తామంటూ బెదిరించారు. అతని అరాచకాలపై, క్రిమినల్ కేసుపై సీఐడీతో పాటు మేము కూడా హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లబోతున్నాం. అలాగే హైదరాబాద్, సిటీ సివిల్ కోర్టులో కేసు వేశాం. అలాగే మాకు న్యాయం జరిగేంతవరకు అవిశ్రాంతంగా పోరాటం చేస్తాం. మిగతా బాధితులందరినీ కలుపుకుని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, తమిళనాడు సీఎంను కలిసి అన్ని విషయాలను వివరిస్తాం..’’ అని చెప్పుకొచ్చారు.