Naani: పహల్గామ్ లోనే ఇరవై రోజులు హిట్ -3 షూటింగ్...

ABN , Publish Date - Apr 23 , 2025 | 10:39 AM

నలభై సంవత్సరాలైన కశ్మీర్ కథ మారలేదని తనికెళ్ళ భరణి వాపోయారు. 'ది కశ్మీరీ ఫైల్స్'లో చూపించింది చాలా తక్కువ అని అనుపమ్ ఖేర్ ఆవేదన వ్యక్తం చేశారు. 'హిట్ -3' షూటింగ్ రెండు వందల మందితో అక్కడే చేశామని నాని గుర్తు చేసుకున్నారు....

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ (Phalgam) లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని సినీ ప్రముఖులు ఖండించారు. మినీ స్విడ్జర్లాంగ్ గా పేర్గాంచిన బైసరమ్ ప్రాంతానికి విహారానికి వెళ్ళిన పర్యాటకులపై ముస్లిం ఉగ్రవాదులు పైశాచికంగా దాడి చేయడం, అక్కడిక్కడే 26 మంది చనిపోవడం జరిగింది. మరో ఇరవై మందిపైగా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పలు దేశాలకు చెందిన ప్రభుత్వాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సైతం తమ ఆవేదనను ఎక్స్ వేదికగా తెలిపారు. చిరంజీవి (Chiranjeevi), మోహన్ బాబు (Mohanbabu), కమల్ హాసన్ (Kamal Haasan), మోహన్ లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్, సోనూసూద్, నాగబాబు, రాధికా శరత్ కుమార్, సంయుక్త, అనన్య నాగళ్ళ, సుమ కనకాల తదితరులు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. అలానే రామ్ చరణ్‌ (Ramcharan), అల్లు అర్జున్ (Allu Arjun), జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), సాయిధరమ్ తేజ్, మంచు విష్ణు, మంచు మనోజ్, నిఖిల్ సిద్దార్థ్‌, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నాగశౌర్య, దర్శకుడు బాబీ, నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి, వివేక్ రంజన్ అగ్ని హోత్రి, అనుపమ్ ఖేర్, సురేశ్‌ గోపీ తదితరులు ఈ దాడి హేయమైన చర్య అని తెలిపారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు.


మూడు నెలల క్రితం రెండు వందల మంది సభ్యులతో ఇరవై రోజుల పాటు 'హిట్ 3' షూటింగ్ చేశామని, అటువంటి చోట ఇలాంటి ఉగ్రదాడి జరగడం బాధగా ఉందని, మాటలు రావడం లేదని హీరో నాని వాపోయారు.

nani.png

''అతికిరాతకం మనవారిని చంపిన టెర్రిస్టులకు తగిన గుణపాఠం చెప్పాలి. మనం మౌనంగా ఉపేక్షిస్తూ కూర్చోమని వారికి తెలియాలి. ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్... టెర్రరిస్టులకు తగిన బుధ్ది చెబుతూ తక్షణమే చర్యలు తీసుకోవాలి'' అని సంజయ్ దత్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ళ భరణి నాలుగు దశాబ్దాల క్రితం కశ్మీర్ పై రాసిన తన కవిత ఇంకా తడిగానే ఉందంటూ దానిని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

Untitled-21.jpg

Updated Date - Apr 23 , 2025 | 11:00 AM