Venu Thottempudi: హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదు.. విషయం ఏమిటంటే..
ABN , Publish Date - Feb 05 , 2025 | 09:52 PM
వేణు తొట్టెంపూడి.. ఈ పేరు ఇప్పటి వాళ్లకి పెద్దగా తెలియదేమో కానీ.. ఒకప్పుడు ‘చిరునవ్వుతో’, ‘స్వయంవరం’ వంటి వరుస హిట్స్‌తో ఆయన పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. ఈ మధ్య వచ్చిన రవితేజ సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’లో కూడా వేణు నటించారు. చాలా గ్యాప్ తర్వాత వేణు చేసిన చిత్రమిది. సినిమా అవకాశాలు లేక కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్న వేణుపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. మ్యాటర్ ఏంటంటే..
‘చిరునవ్వుతో’, ‘స్వయంవరం’ వంటి చిత్రాల హీరో తొట్టెంపూడి వేణుపై కేసు నమోదైంది. ఈ మధ్యకాలంలో ఆయనకు అవకాశాలు లేకపోవడంతో.. ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధిగా ఆయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీతో కలిసి 2002లో ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. కానీ మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ నుండి ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ తప్పుకుంది. ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో పాటు.. రిత్విక్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులు రద్దు చేసుకున్నట్లుగా తెలుస్తుంది.
Also Read- Tollywood Producer: పవన్ కళ్యాణ్, మహేష్‌లతో చేసిన చిత్రాలతో రూ. 100 కోట్లు నష్టపోయా..
ఇలా మధ్యలో కాంట్రాక్ట్‌ని రద్దు చేసుకోవడం వల్ల తమకు భారీ నష్టం వచ్చిందని వేణు, ప్రోగ్రెసివ్ సంస్థ నిర్వాహకులపై రిత్విక్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్‌ను పరిశీలించిన నాంపల్లి రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు తొట్టెంపూడి వేణుతో పాటు సంస్థ నిర్వాహకులపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుటుంబానికి చెందినదని, ఈ కంపెనీని ఆయన సోదరుడు నిర్వహిస్తూ ఉంటారని సమాచారం.
Also Read- Samantha: మాజీ భర్త మళ్లీ పెళ్లిపై సమంత షాకింగ్ కామెంట్స్..
వాస్తవానికి ఇలాంటి కాంట్రాక్ట్ వ్యవహారాలను కోర్టు వరకు రానివ్వరు. ఇది కాంట్రాక్ట్‌కి సంబంధించినదే కాకుండా.. లోపల చాలా ముసుగులు ఉన్నాయనేలా టాక్ వినబడుతుంది. ఒకప్పటి హీరో అయిన వేణు తొట్టెంపూడి ఇందులో ఉండటంతో.. ఈ కేసు వ్యవహారం బాగా హైలెట్ అవుతుంది. ఫైనల్‌గా ఈ కేసు ఎటు వైపుకు దారి తీస్తుందో చూడాల్సి ఉంది.