Nuvve Kavali: బిగ్ బాస్ తెలుగు బ్యాచ్ అంతా కలిశారు.. దేనికో తెలుసా?
ABN , Publish Date - Jan 25 , 2025 | 08:39 PM
బిగ్ బాస్ తెలుగు హౌస్‌లోకి వెళ్లివచ్చిన కంటెస్టెంట్స్ అందరూ రెగ్యులర్‌గా కలుస్తూనే ఉంటామని.. కంటెస్టెంట్స్ చాలా మంది ఇప్పటికే చెప్పి ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండటంతో ఒకరిద్దరు, లేదంటే ఓ నలుగురైదుగురు మాత్రమే కలిసి కనిపిస్తున్నారు. కానీ, తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో మాత్రం దాదాపు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలా మంది ఒక చోటకు చేరారు. వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ తెలుగు బ్యాచ్ అంతా ఒకే చోట చేరారు. చాలా రోజుల తర్వాత వీరంతా ఒక ఈవెంట్‌లో పాల్గొనడం విశేషం. ఇంతకీ వీరంతా ఒకే చోటకు ఎందుకు చేరారంటే.. మహబూబ్ దిల్ సే, శ్రీ సత్య కలిసి చేసిన ప్రైవేట్ ఆల్బమ్ యూత్ ఫుల్ సాంగ్ ‘నువ్వే కావాలి’ని హైదరాబాద్‌లో డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ ఆర్గనైజ్ చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా సోహెల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, సిరి హనుమంత్, గీతు రాయల్ మరియు ఇతర బిగ్ బాస్ సెలబ్రిటీలు మరియు క్రియేటివ్ హెడ్ క్రాఫ్ట్లీ చందు పాల్గొన్నారు.
Also Read- Akhanda 2 Thandavam Heroine: ప్రగ్యా జైస్వాల్ ఏమైంది.. ఇదేం ట్విస్ట్ బోయపాటి?
ఈ పాటకి సురేష్ బనిశెట్టి లిరిక్స్ అందించగా, భార్గవ్ రవడ డిఓపి, ఎడిటింగ్ మరియు డైరెక్షన్ అన్ని తానే అయ్యి ఈ సాంగ్‌ను చిత్రీకరించారు. ఈ సాంగ్ మనీష్ కుమార్ మ్యూజిక్ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్ వాయిస్‌కి ఆయనతో జతకట్టారు. యూరోప్‌లోని బార్సిలోన, మెక్సికో మరియు పారిస్ వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరించారు. ఈ ఆల్బమ్ లాంచ్ సందర్శంగా శ్రీ సత్య మాట్లాడుతూ.. ఈ లాంచ్ కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఎంతో మంది ఫ్రెండ్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు. ఈ సాంగ్‌కి నన్ను సెలక్ట్ చేసిన భార్గవ్‌కు ధన్యవాదాలు. మెహబూబ్‌తో కలిసి ఈ సాంగ్ చేసినందుకు హ్యాపీ. ప్రేక్షకులు ఈ సాంగ్‌ని పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
మహబూబ్ మాట్లాడుతూ.. నాకోసం టైం కేటాయించి అడగగానే వచ్చిన నా ఫ్రెండ్స్ సోహెల్, నోయల్, విక్కీ, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా, ప్రియాంక ఇలా విచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని అంటుంటే సంతోషంగా ఉంది. అడగగానే ఈవెంట్‌ని హోస్ట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసిన స్రవంతి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈవెంట్‌ని ఆర్గనైజ్ చేసిన వారికీ ధన్యవాదాలు. ప్రేక్షకులు కూడా ఈ సాంగ్‌ని ఆదరించాలని కోరుతున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌతమ్ కృష్ణ, సిరి హనుమంత్, ప్రియాంక జైన్, కిరాక్ సీత, గీతు రాయల్, మణికంఠ, అర్జున్ కళ్యాన్, సొహైల్, నోయల్, రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడా వంటి వారు ప్రసంగించారు.