Fakir: ఓటీటీలో ధనుష్ హాలీవుడ్ మూవీ!

ABN , Publish Date - Mar 24 , 2025 | 06:08 PM

ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది ఎక్స్ ఆర్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్' త్వరలో ఆహాలో తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది.

పాన్ ఇండియా కల్చర్ కు అలవాటు హీరోల మనసు ఇప్పుడు గ్లోబల్ రీచ్ పై పడింది. అప్ కమింగ్ మూవీస్... హాలీవుడ్ రేంజ్ లో ఉండాలని ఆశపడుతున్నారు. ప్రజెంట్ హీరోల టార్గెట్ పాన్ వరల్డ్ అయితే.. అప్పుడెప్పుడో ఏకంగా హాలీవుడ్ మూవీలో నటించాడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush). దాదాపు ఏడేళ్ల క్రితం ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌ (The Extraordinary Journey Of The Fakir) లో మెరిశాడు. సినిమా టాక్ ఎలా ఉన్నా... ధనుష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. పలువురిని మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీకి వచ్చేస్తుండటంతో ధనుష్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.


2019లో వచ్చి థియేటర్లలో మాత్రమే సందడి చేసిన ఈ సినిమా ప్రస్తుతం యాపిల్ టీవీప్లస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది కేవలం ఇంగ్లిష్‌ వెర్షన్‌లో మాత్రమే ఉంది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 26 నుంచి ఆహాలో (Aha) స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారికి ఈ నెల 25 నుంచే అందుబాటులోకి రానుంది. కేవలం 92 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రాన్ని దాదాపు రూ.175 కోట్లతో తెరకెక్కించారు.

‘హు ట్రాప్డ్‌ ఇన్‌ యాన్‌ ఐకియా వార్డ్‌రోబ్‌’ అనే ఫ్రెంచ్‌ నవల ఆధారంగా కెన్‌ స్కాట్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హాలీవుడ్‌ నటులు బెన్‌ మిల్లర్‌, హెరిన్‌ మోరియాట్రీ కీలక పాత్రల్లో నటించారు. ముంబైకి చెందిన లవశ్‌ పటేల్‌ స్ట్రీట్‌ మెజీషియన్‌. తనకు మంత్ర శక్తులు తెలుసునని అందరినీ నమ్మిస్తుంటాడు. తల్లి మరణాంతరం... పారిస్‌లో ఉన్న తన తండ్రిని వెతుక్కుంటూ వెళ్తాడు. అక్కడ ఊహించని పరిస్థితుల్లో ఐకియా వార్డ్‌ రోబ్‌లో చిక్కుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది అన్న ఆసక్తికరమైన అంశాలు సినిమా చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి ధనుష్ హాలీవుడ్ మూవీ అందుబాటులోకి రానున్నడంతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

Also Read: Pratik Gandhi: జ్యోతిరావు ఫూలే జయంతికి బయోపిక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Mar 24 , 2025 | 06:09 PM