Oscar Awards: ఆస్కార్ - 2025 అవార్డుల .. ఎవరికి రావచ్చు
ABN , Publish Date - Feb 28 , 2025 | 06:38 PM
ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులకు ఆనందం పంచే అవార్డులుగా పేరొందిన అకాడెమీ అవార్డుల (Academy awards) వేడుక మార్చి 3వ తేదీ ఉదయం 5.30 గంటలకు మొదలు కానుంది.
ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానులకు ఆనందం పంచే అవార్డులుగా పేరొందిన అకాడెమీ అవార్డుల (Academy awards) వేడుక మార్చి 3వ తేదీ ఉదయం 5.30 గంటలకు మొదలు కానుంది. ఆస్కార్ (Oscar Awards) అవార్డుల ప్రదానోత్సవాన్ని తిలకించడానికి సినీఫ్యాన్స్ తో పాటు పలు ప్రభుత్వాలలో ఉన్నతస్థానాలను అలంకరించిన వారూ కొందరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డుల వేదిక అయిన లాస్ ఏంజెలిస్ లో పలు సంస్థలు ఏ విభాగంలో ఎవరికి అవార్డు దక్కనుంది అన్న అంశంపై సర్వేలు నిర్వహించాయి. అందులో పలు సర్వేలు పలు రకాల ఫలితాలు వెల్లడించాయి. అయితే అనేక సర్వేల్లో విజేతలుగా నిలచిన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ఓ చోట పోగు చేశారు. తత్ఫలితంగా వెలుగు చూసిన అంచనాల జాబితాను మీ కోసం ఇక్కడ పొందు పరుస్తున్నాం. మార్చి 3వ తేదీన జరిగే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ జాబితాలోని ఎందరు విజేతలుగా నిలుస్తారో చెక్ చేసుకోవచ్చు.
ఉత్తమ చిత్రం : కాన్ క్లేవ్ (Conclave)
ఉత్తమ దర్శకుడు : షాన్ బేకర్ (అనోరా) (Sean Baker - Anora)
ఉత్తమ నటుడు : ఆడ్రియెన్ బ్రాడీ (ద బ్రూటలిస్ట్) (Adrien Brody - The Brutalist)
ఉత్తమ నటి : డెమీ మూర్ (ద సబ్ స్టాన్స్) (Demi Moore - The Substance)
ఉత్తమ సహాయ నటుడు : కియెరన్ కల్కిన్ (ద రియల్ పెయిన్)
ఉత్తమ సహాయ నటి : జో సల్డానా ( ఎమిలియా పెరేజ్)
ఉత్తమ రచన (ఒరిజినల్ స్క్రీన్ ప్లే) : షాన్ బేకర్ (అనోరా)
ఉత్తమ రచన (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే) : పీటర్ స్ట్రౌగన్ (కాన్ క్లేవ్)
ఉత్తమ అంతర్జాతీయ చిత్రం : ఎమిలియా పెరేజ్ (ఫ్రెంచి)
ఉత్తమ యానిమేటెడ్ ఫిలిమ్ : ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్ లఘు చిత్రం : 'యక్'
ఉత్తమ డాక్యుమెంటరీ ఫిలిమ్ : పోర్స్ లేయిన్ వార్
ఉత్తమ డాక్యుమెంటరీ లఘు చిత్రం : ది ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిమ్ : ద లాస్ట్ రేంజర్
ఉత్తమ సంగీతం (ఒరిజినల్ స్కోర్) : జాన్ పావెల్, స్టీఫెన్ ష్వార్జ్ (వికెడ్)
ఉత్తమ సంగీతం (ఒరిజినల్ సాంగ్) : "ఎల్ మల్..." (ఎమిలియా పెరేజ్) - సంగీతం: క్లెమెంట్ డకోల్, కమిల్లే - గీతరచన : క్లెమెంట్ డకోల్, కమల్లే, జాక్వెస్ ఆడియార్డ్
ఉత్తమ శబ్దగ్రాహణం : టాడ్ ఎ.మాయిట్లాండ్, డోనాల్డ్ సిల్వెస్టర్, టెడ్ కప్లాన్, పాల్ మస్సే, డేవిడ్ జియమ్మర్కో (ద కంప్లీట్ అన్నోన్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : నాథన్ క్రోలే, లీ శాండలెస్ (వికెడ్)
ఉత్తమ సినిమాటోగ్రఫి : లోల్ క్రాలే (ద బ్రూటలిస్ట్)
ఉత్తమ మేకప్ అండ్ హేర్ స్టైలింగ్: పియరీ ఒలీవియర్ పెర్సిన్, స్టిఫనీ గ్విల్లాన్, మేర్లిన్ స్కార్సెల్లీ (ద సబ్ స్టాన్స్)
ఉత్తమ ఎడిటింగ్ : నిక్ ఎమర్సన్ (కాన్ క్లేవ్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ : పాల్ టేజ్ వెల్ (వికెడ్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : డ్యూన్ పార్ట్ 2