Oscars 2025: అప్పుడు అన్నారు.. ఇప్పుడు  అమలు చేశారు 

ABN , Publish Date - Mar 03 , 2025 | 04:33 PM

95 ఏళ్ళుగా ఆస్కార్ (Oscars) అవార్డుల్లో ఈ కేటగిరీలనే 'బిగ్ ఫైవ్' (Big Five)గా (Big Five.. Big seven) భావిస్తూ వస్తున్నారు. అయితే రెండు సంవత్సరాల క్రితం విఖ్యాత హాలీవుడ్ దర్శకులు స్టీవెన్ స్పీల్ (hollywood Directors) బెర్గ్, జేమ్స్ కేమరాన్ వంటివారు ఇకపై ఏ సినిమా అవార్డుల్లోనైనా  'బిగ్ సెవెన్' ను  పరిగణించాలని పేర్కొన్నారు.

సాధారణంగా ఏ సినిమా అవార్డుల్లోనైనా  ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే అన్నవే ముందు వరుసను ఆక్రమిస్తూ ఉంటాయి. అందువల్లే 95 ఏళ్ళుగా ఆస్కార్ (Oscars) అవార్డుల్లో ఈ కేటగిరీలనే 'బిగ్ ఫైవ్' (Big Five)గా (Big Five.. Big seven) భావిస్తూ వస్తున్నారు. అయితే రెండు సంవత్సరాల క్రితం విఖ్యాత హాలీవుడ్ దర్శకులు స్టీవెన్ స్పీల్ (hollywood Directors) బెర్గ్, జేమ్స్ కేమరాన్ వంటివారు ఇకపై ఏ సినిమా అవార్డుల్లోనైనా  'బిగ్ సెవెన్' ను  పరిగణించాలని పేర్కొన్నారు. ఎందుకంటే ఓ సినిమా రూపకల్పనకు ప్రప్రథమంగా కావలసినది కథ, ఆ తరువాత నిర్మాత, ఆ పై దర్శకుడు. వారికి కావలసిన తగిన నటీనటులు, వారి నటనను తెరకెక్కించే సినిమాటోగ్రఫి (Cinematography), ప్రేక్షకులను మెప్పించేలా షూట్ చేసిన సినిమాను పొందుపరిచే ఎడిటింగ్ (Editing) కూడా అత్యంత అవసరమని (Oscars 2025) దిగ్దర్శకులు భావించారు. అప్పటి నుంచీ 'బిగ్ సెవెన్' (Big Seven) అనే పదం విశేషంగా వినిపిస్తోంది. అంతకు ముందు 'బిగ్ ఫైవ్'కే పరిమితమైన మాట, గత యేడాది నుండి సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాలను కూడా జత చేసుకొని 'బిగ్ సెవెన్' మారింది. అంతేకాదు అమెరికాలోని అత్యధికులకు 'నంబర్ సెవెన్' అన్నది లక్కీ నంబర్. దేవుడు సృష్టి ఆరంభంలోనే ఏడు రోజులను నిర్ధారించినందువల్ల 'ఏడు' అన్నది లక్కీ నంబర్ గా భావిస్తారు. అది మతపరమైన విశ్వాసం కాగా, జార్జి మిల్లర్ అనే మానసిక వైద్యనిపుణుడు మనిషి మస్తిష్కం ఏకకాలంలో ఏడు విషయాలను గుర్తు పెట్టుకోగలదని నిర్ధారించారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచంలోని అత్యధిక దేశాలలో 'ఏడో' నంబర్ కు ఎంతో ప్రాధాన్యముంది. మన భారతీయులకు కూడా 'సప్త' అన్నది ఎంతో ప్రధానమైనది. అంత ప్రాముఖ్యం ఉన్న ఏడో నంబర్  ఈ సారి ఆస్కార్ అవార్డ్స్ లో 'బిగ్ సెవెన్'గా ఏడు కేటగిరీలను పేర్కొన్నారు. అంతకు ముందు బిగ్ ఫైవ్ గా ప్రాచుర్యంలో ఉన్న "బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ స్క్రీన్ ప్లే"తో పాటు ఈ సారి "బెస్ట్ సినిమాటోగ్రఫి, బెస్ట్ ఎడిటింగ్" ను కూడా కలిపి 'బిగ్ సెవెన్' అంటున్నారు.

మరి 97వ ఆస్కార్ (97th Oscars) అవార్డుల ప్రదానోత్సవంలో 'బిగ్ సెవెన్'గా నిలచిన విజేతలెవరో చూద్దాం! ఈ సారి బెస్ట్ పిక్చర్ గా షాన్ బేకర్ తెరకెక్కించిన 'అనోరా' చిత్రం నిలచింది. ఆ సినిమా దర్శకుడు షాన్ బేకర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక అదే చిత్రంలో నటించిన మిక్కీ మేడిసన్ బెస్ట్ యాక్ట్రెస్ గా ఆస్కార్ ను అందుకున్నారు. బెస్ట్ స్క్రీన్ ప్లే (ఒరిజినల్) విభాగంలోనూ 'అనోరా' సినిమా ద్వారా షాన్ బేకర్ నిలిచారు. మరింత విశేషంగా 'అనోరా' సినిమాతోనే షాన్ బేకర్ బెస్ట్ ఎడిటర్ గానూ గెలిచారు. ఇలా 'బిగ్ సెవెన్'లో 'అనోరా' సినిమాయే ఐదు అవార్డులు సొంతం చేసుకోవడం 97వ ఆస్కార్ వేడుకలో ఓ విశేషంగా నిలచింది. ఇక బెస్ట్ యాక్టర్ గా 'ద బ్రూటలిస్ట్'లో నటించిన ఆడ్రియెన్ బ్రాడీ, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా 'ద బ్రూటలిస్ట్'కు పనిచేసిన లోల్ క్రాలే విజేతలుగా నిలిచారు. అయితే బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో  'కాన్ క్లేవ్'  సినిమాద్వారా పీటర్ స్ట్రాఘన్ ఎన్నికయ్యారు.

Updated Date - Mar 03 , 2025 | 04:33 PM