Mufasa: ముఫాసా ఓటీటీలో ఎప్పుడంటే..

ABN , Publish Date - Feb 09 , 2025 | 11:38 AM

ఈ తరహా కథల్లో సింహాల్ని పెట్టి ముందుకు తీసుకెళ్లడంతో ‘ముఫాస:ది లయన్‌ కింగ్‌’ చిత్రం ప్రేక్షకులకు దగ్గరైంది. 2019లో విడుదలైన ‘ది లయన్‌ కింగ్‌’కు ప్రీక్వెల్‌గా వచ్చిన చిత్రమిది.

ఒక రాజ్యానికి సంబంధించి  సింహాసనం.. యువరాజు.. రాజు.. వీటిని సొంతం చేసుకోవడం జరిగే ఎత్తులకు పైఎత్తులు వేయడం సహజం. చాలా సినిమాల్లో చూసే ఉన్నాం. ఈ తరహా కథల్లో సింహాల్ని పెట్టి ముందుకు తీసుకెళ్లడంతో ‘ముఫాస:ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion king) చిత్రం ప్రేక్షకులకు దగ్గరైంది. 2019లో విడుదలైన ‘ది లయన్‌ కింగ్‌’కు ప్రీక్వెల్‌గా వచ్చిన చిత్రమిది.
హాలీవుడ్‌ సంస్థ డిస్నీ తెరకెక్కించిన  ఈ చిత్రం గతేడాది విడుదలై చిన్నారుల నుంచి పెద్దవారి వరకూ అలరించింది. పలు భాషల్లో ఈ సినిమా రూపొందింది.

Mufasa-aa.jpg

తెలుగులో  కథానాయకుడు మహేశ్‌బాబు(Mahesh Babu).. ముఫాసా పాత్రకు తన గాత్రాన్ని అందించడం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  ముఫాసా అసలు రాజుగా ఎలా ఎదిగాడు. ఆయన గత చరిత్ర ఏంటి? అనే అంశాల్ని చూపించిన విధానం సినీప్రియుల్ని మెప్పించింది. థియేటర్లలో హిట్‌ బొమ్మ అనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా అలరించడానికి సిద్ధమైంది. ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో (Disney plus hotstar) ఈ నెల 18 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు ఓటీటీ సంస్థ తెలిపింది.

Updated Date - Feb 09 , 2025 | 11:38 AM