Hollywood: ఇళ్లు వదిలి వెళ్లిన హాలీవుడ్ స్టార్స్.. భీకర కార్చిచ్చు

ABN , Publish Date - Jan 08 , 2025 | 12:22 PM

Hollywood: పైన కనిపిస్తున్న ఫోటో సినిమాల్లోది కాదు. లాస్ ఏంజెల్స్ లో ఏర్పడిన కార్చిచ్చు కారణంగా కొన్ని వేల ఎకరాల్లో తీవ్ర నష్టం జరిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ ఇళ్ళు వదిలి వెళ్లిపోయారు.

Wildfires Rage in Los Angeles

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో భీకర కార్చిచ్చు రాజేసుకుంది. కొన్ని గంటల్లోనే మంటలు సూదూర ప్రాంతాలకు వ్యాపించాయి. కొన్ని వేల హెక్టార్ల అసువులు దగ్ధం అయిపోయాయి. దీంతో లాస్ ఏంజెల్స్ లో ఎమెర్జెన్సీ పరిస్థితి ఏర్పడింది. దీంతో పరివాహక ప్రాంతాల్లోని 13 వేల నివాసాలు, దాదాపు 30 వేల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు.ఇందులో ప్రముఖ హాలీవుడ్ నటులు కూడా ఉన్నారు.


ఈ కార్చిచ్చు కారణంగా హాలీవుడ్ స్టార్ యాక్టర్స్.. జెన్నిఫర్ అనిస్టన్, బ్రాడ్లీ కూపర్, టామ్ హాంక్స్, రీస్ విథర్‌స్పూన్, ఆడమ్ సాండ్లర్, మైఖేల్ కీటన్ వేరే ప్రాంతాలకు తరలి వెళ్లారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మూడు వేల ఎక‌రాల వ‌ర‌కు మంట‌లు వ్యాపించిన‌ట్లు తెలుస్తోంది.


ఈ ప్రమాదానికి ముందు మంగళవారం సాయంత్రం లాస్ ఏంజెల్స్ లో చిన్న కార్చిచ్చు ఏర్పడింది. గాలి తీక్ష‌ణంగా వీయడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ మంటల్ని ఆపడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు శాంటి మోనికా, మాలిబు సిటీల మధ్య ఉన్న ప‌సిఫిక్ పాలిసేడ్స్ లో సుమారు 12 స్క్వేర్ కిలోమీట‌ర్ల మేర అడవి కాలిపోయింది. లాస్ ఏంజెల్స్ లోని 46 వేల ఇండ్ల‌కు విద్యుత్తు స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్పడింది. ఆల్ట‌డేనాలో 200 ఎకరాల్లో అడవి దగ్ధం అయ్యింది. ఈ కార్చిచ్చు మరింత ప్రమాదకరంగా మారినట్లు సమాచారం.

Updated Date - Jan 08 , 2025 | 12:28 PM