Golden Globes 2025: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఆ సినిమా నిరాశపర్చింది
ABN , Publish Date - Jan 06 , 2025 | 10:42 AM
సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు సినీతారలు హాజరై సందడి చేశారు.
సినీ పరిశ్రమ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. కాలిఫోర్నియాలోని బేవర్లీ హిల్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు సినీతారలు హాజరై సందడి చేశారు. స్టాండప్ కమెడియన్ నక్కీ గ్లేజర్ వ్యాఖ్యతగా వ్యవహరించి నవ్వులు పూయించారు. ఈ అవార్డుల్లో పాయల్ కపాడియా దర్శకత్వం వహించిన ‘ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్’ (All We Imagine as Light) రెండు విభాగాల్లో పోటీ పడింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం రెండు కేటగిరీల్లోను దానికి అవార్డు రాకపోవడంతో సినీ ప్రియులు నిరాశకు గురయ్యారు. గత నెలలో ఈ అవార్డుల నామినేషన్‌లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
వాటిల్లో ‘ఎమిలియా పెరెజ్’(Emilia Pérez) ఏకంగా 10 నామినేషన్లు దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఉత్తమ చిత్రంతో సహా పలు అవార్డులను సొంతం చేసుకుంది.
గోల్డెన్ గ్లోబ్ విన్నర్స్ లిస్ట్..
ఉత్తమ చిత్రం - ఎమిలియా పెరెజ్
ఉత్తమ నటి - డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్)
ఉత్తమ నటుడు - సెబాస్టియన్ స్టాన్ ( ఎడిఫరెంట్ మ్యాన్)
ఉత్తమ యానిమేటెడ్ చిత్రం - ఫ్లో
ఉత్తమ దర్శకుడు - బ్రాడీ కార్బెట్ ( ది బ్రూటలిస్ట్)
ఉత్తమ స్క్రీన్ ప్లే - పీటర్ స్ట్రాగన్
ఉత్తమ ఒరిజినల్ స్కోర్ - ట్రెంట్ రెజ్నార్ (ఛాలెంజర్స్)
ఉత్తమ సహాయ నటి - జోసల్దానా (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ సహాయ నటుడు - కీరన్ కల్కిన్ (ఎ రియల్ పెయిన్)
ఉత్తమ నటుడు (టీవీ) - హిరోయుకి సనాడా (షోగన్)
ఉత్తమ నటి (టీవీ) - జెస్సికా గన్నింగ్ (బేబీ రైన్డీర్)