Ed Sheeran: ఎడ్‌ షీరన్‌కు షాకిచ్చిన బెంగళూరు పోలీసులు

ABN , Publish Date - Feb 09 , 2025 | 05:52 PM

పాప్ సింగర్ ఎడ్ షీరన్ ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే.. పోలీసులు ఆయనకు పెద్ద షాక్కిచ్చారు. ఈ వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.

Bengaluru police stop Ed Sheeran from Peroformace

వరల్డ్ ఫేమస్ పాప్ సింగర్ ఎడ్‌ షీరన్‌ పేరు ఇప్పుడు ఇండియాలో మార్మోగుతుంది. షేప్ ఆఫ్ యు(Shape Of You) వంటి ఛార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన ఆయన రెండోసారి ఇండియాలో టూర్ నిర్వహిస్తున్నాడు. తాజా టూర్‌లో పూణే, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆయన షోలకు మంచి ఆదరణ లభించింది. నెక్స్ట్ షిల్లాంగ్, ఢిల్లీలో షోలు నిర్వహించాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా తాజాగా బెంగుళూరులో ఆయన షో ముగిసిన తర్వాత అభిమానులకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే.. బెంగళూరు పోలీసులు ఆయనకు షాకిచ్చారు. ఇంతకు ఏమైందంటే..


'కోల్డ్ ప్లే' కన్సర్ట్ తర్వాత 'ఎడ్‌ షీరన్‌' కన్సర్ట్ తో ఇండియా పాప్ లోకం వెస్ట్రన్ సంగీతంలో మునిగి తేలుతోంది. ఫిబ్రవరి 8న బెంగళూరులో షో పూర్తి చేసుకున్న షీరన్‌ ఫిబ్రవరి 12న షిల్లాంగ్ లో పర్ఫామ్ చేయాల్సి ఉంది. ఈ గ్యాప్ లో ఆయన బెంగళూరులో చిల్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం బెంగళూరు సిటీలోని చర్చ్ స్ట్రీట్ లో ఫ్యాన్స్ కోసం ఒక సర్ప్రైజింగ్ స్ట్రీట్ సైడ్ గిగ్ నిర్వహించాడు. ఇందులో ఆయన షేప్ ఆఫ్ యు పాట పాడుతూ.. ఎంటర్టైన్ చేస్తుండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేశారు. ఎడ్‌ పాడుతుండగానే మైక్ వైర్లు పీకేశారు. ఒకవైపు దీనికోసం మేము పర్మిషన్ తీసుకున్నాం అని వారిస్తున్నా పోలీసులు వినకపోవడంతో.. మళ్ళీ నెక్స్ట్ టైమ్ కలుద్దాం అని ఎడ్‌ షీరన్‌ చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. దీంతో ఎడ్ అభిమానులు పోలీసులపై మండిపడుతున్నారు.


‘నాటు నాటు’ అంటే ఇష్టం

గతంలో ఇండియాకు ఎడ్ షీరన్ వచ్చినప్పుడు మాట్లాడుతూ.. ‘‘నా స్నేహితులతో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వీక్షించా. అద్భుతమైన చిత్రమిది. ‘నాటు నాటు’ పాటలో డ్యాన్స్‌ చాలా బాగుంది. సాంకేతిక పరంగా కూడా ఈ చిత్రం నాకెంతో నచ్చింది’’ అన్నాడు. అలాగే ముంబైలో షారుక్‌ ఏర్పాటు చేసిన పార్టీలో షారుక్‌తో కలిసి షీరన్‌ డాన్స్ చేశాడు. అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మా’ పాటకు వేసిన స్టెప్పులు హైలెట్ గా నిలిచాయి.

Updated Date - Feb 09 , 2025 | 05:57 PM