Coldplay Indian Concert: 'కోల్డ్ ప్లే' హీటెక్కించింది

ABN , Publish Date - Jan 26 , 2025 | 03:07 PM

Coldplay Indian Concert: మిరుమిట్లు కొల్పుతూ నిండు స్టేడియం కళకళలాడుతుండగా ఆకాశంలో బాణాసంచాలు ఎగిసిపడ్డాయి. 'కోల్డ్ ప్లే' పాటలకు స్టేడియం అంతా ఉర్రూతలూగింది.

Coldplay's Ahmedabad concert

ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ 'కోల్డ్ ప్లే' ఇండియా పర్యటన ఘనంగా సాగుతోంది. గతవారం ముంబైలో నిర్వహించిన ఈ కన్సర్ట్ కి భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన.. బ్యాండ్ పర్ఫామెన్స్ కాస్త నిరాశపరిచింది. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం, శనివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్డ్ ప్లే పర్ఫామ్ చేయనున్న విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం జరిగిన ప్రదర్శనకు భారీ స్పందన లభించింది/ లక్ష ముప్పైరెండు వేల మంది కెపాసిటీని కలిగి ఉండి.. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ వేదికపై కోల్డ్ ప్లే పర్ఫామెన్స్ ఎలా సాగిందంటే..


ప్రారంభంలోనే బ్యాండ్ మెయిన్ వొకాలిస్ట్ క్రిస్ మార్టిన్ "తామే లోగో ఆజే బాధ సుందర్ లాగో చో. హు తమరే షహర్ మా ఆవ్యో చు. కేమ్ చో అహ్మదాబాద్?" అంటూ గుజరాతీలో ఆడియన్స్ గ్రీట్ చేయడంతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత మిరుమిట్లు కొల్పుతూ నిండు స్టేడియం కళకళలాడుతుండగా ఆకాశంలో బాణాసంచాలు ఎగిసిపడ్డాయి. 'కోల్డ్ ప్లే' పాటలకు స్టేడియం అంతా ఉర్రూతలూగింది. శనివారం కూడా ఈ కన్సర్ట్ ని ఘనంగా కొనసాగించున్నారు. ఈ ఈవెంట్ లైవ్ ప్రసారాన్ని డిస్నీ+ హాట్‌స్టార్ లో రాత్రి 7:45 నిమిషాలకు వీక్షించ వచ్చు.


మరోవైపు.. ఒక ప్రధాని స్థాయి పొలిటికల్ మీటింగ్‌కు ఎలా అయితే సెక్యూరిటీ ఉంటుందో.. ఈ కన్సర్ట్‌కు కూడా అదే స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకను చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఎలాంటి అధికారి అయినా తనిఖీ చేయకుండా లోపలికి ప్రవేశించలేరని, అందుకు తగినట్లుగా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లుగా నీరజ్ కుమార్ బద్గుజార్ తెలిపారు. దాదాపు లక్షమంది వరకు ఈ కన్సర్ట్‌కు వచ్చే అవకాశం ఉండటంతో.. స్టేడియం మొత్తం 3800 మంది పోలీసు సిబ్బంది మోహరించి ఉంటారని, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) బృందం కీలక ప్రదేశాలలో ఉంటుందని ఆయన చెబుతున్నారు.

Also Read- Padma Bhushan Puraskar 2025: బాలయ్యతో పాటుగా పద్మ భూషణ్ పొందిన నటులెవరంటే..

Also Read- Mass Jathara Teaser: జాతర కాదు.. ర్యాంపేజ్.. ‘మనదే ఇదంతా’!

Also Read- Padma Bhushan Balakrishna: బాలయ్యకు పద్మభూషణ్

Also Read- SSMB29 Memes: మహేశ్‌పై మీమ్స్‌.. ప్రియాంక ఫిక్స్‌

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 03:16 PM