Coldplay Ahmedabad: బాబోయ్.. ఒక కన్సర్ట్‌కి ఇంత సెక్యూరిటీనా? భద్రతా ఏర్పాట్లు తెలిస్తే షాకవ్వాల్సిందే!
ABN , Publish Date - Jan 25 , 2025 | 05:34 PM
Coldplay Concert India: ప్రముఖ బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే దాదాపు 8 సంవత్సరాల తర్వాత భారత్‌లో వారి రెండో ప్రదర్శనను ఇవ్వబోతోంది. జనవరి 25, 26 తేదీలలో గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ కన్సర్ట్‌కు భారీగా భధ్రతా ఏర్పాట్లను రెడీ చేసినట్లుగా అక్కడి పోలీస్ అధికారి తెలిపారు. అంతా ఆశ్చర్యపోయేలా ఈ కన్సర్ట్‌కు భద్రతా ఏర్పాట్లు చేశారు.
గుజరాత్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రముఖ బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్‌ప్లే కన్సర్ట్ జనవరి 25, 26 తేదీలలో జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ కన్సర్ట్ ప్రకటించిన వెంటనే హాట్ కేకులా టికెట్లన్నీ అమ్ముడవడం విశేషం. భారత్‌లో ఈ బ్యాండ్ మొదటి ప్రదర్శన నవంబర్ 2016లో ఇవ్వగా.. మళ్లీ 8 సంవత్సరాల తర్వాత రెండవ ప్రదర్శనను ఇవ్వబోతుండటంతో.. ఈ కన్సర్ట్‌పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టే.. టికెట్లన్నీ అమ్ముడవడం చూస్తుంటే.. ఈ బ్యాండ్ గొప్పతనం ఏమిటో తెలుసుకోవచ్చు. ఇక శని, ఆదివారాల్లో జరిగే ఈ కన్సర్ట్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లుగా జేసీపీ అహ్మదాబాద్ పోలీస్ అధికారి నీరజ్ కుమార్ బద్గుజార్ వెల్లడించారు.
Also Read- Sukumar Daughter Film: మొన్న మహేష్ బాబు.. ఇప్పుడు రామ్ చరణ్!
ఆయన చెబుతున్న భద్రతా ఏర్పాట్లు వివరాలు తెలిస్తే అంతా షాక్ అవుతారు కూడా. ఒక ప్రధాని స్థాయి పొలిటికల్ మీటింగ్‌కు ఎలా అయితే సెక్యూరిటీ ఉంటుందో.. ఈ కన్సర్ట్‌కు కూడా అదే స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వేడుకను చూడటానికి వచ్చే ప్రతి ఒక్కరినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే లోనికి అనుమతిస్తారు. ఎలాంటి అధికారి అయినా తనిఖీ చేయకుండా లోపలికి ప్రవేశించలేరని, అందుకు తగినట్లుగా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లుగా నీరజ్ కుమార్ బద్గుజార్ తెలిపారు. దాదాపు లక్షమంది వరకు ఈ కన్సర్ట్‌కు వచ్చే అవకాశం ఉండటంతో.. స్టేడియం మొత్తం 3800 మంది పోలీసు సిబ్బంది మోహరించి ఉంటారని, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) బృందం కీలక ప్రదేశాలలో ఉంటుందని ఆయన చెబుతున్నారు.
Also Read- Akhanda 2 Thandavam Heroine: ప్రగ్యా జైస్వాల్ ఏమైంది.. ఇదేం ట్విస్ట్ బోయపాటి?
‘‘మహిళా పోలీసు అధికారులు మరియు సిబ్బందితో సహా మెటల్ డిటెక్టర్లతో పాటు నార్మల్ దుస్తులలో ఉన్న అధికారులతో మొత్తం 3,800 మంది పోలీసు సిబ్బంది ఈ కన్సర్ట్‌కు భద్రతగా ఉండనున్నారు. వీరితో పాటు క్రైమ్ బ్రాంచ్ బృందం మరియు ఇతర శాఖల బృందాలు కూడా ఉంటాయని, అదనంగా 400లకు పైగా CCTV కెమెరాల నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసి.. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నామని అని నీరజ్ కుమార్ బద్గుజార్ మీడియాకు తెలిపారు.
అహ్మదాబాద్‌లో కోల్డ్‌ప్లే కచేరీ: భద్రతా ఏర్పాట్లు
కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 400 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, మహిళా పోలీసు అధికారులు, సిబ్బంది సహా సాధారణ దుస్తుల్లో అధికారులు కొంతమంది సభా వేదిక వద్ద ఉంటారు.
నేషనల్ సెక్యూరిటీ గార్డ్, స్పెషల్ ఫోర్స్ యూనిట్ నుండి ఒక బృందం విస్తృతమైన భద్రతా యంత్రాంగంలో భాగంగా ఉంటుంది.
అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ మరియు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ బృందాలు మెట్రో స్టేషన్లతో సహా అనుమానిత ప్రదేశాలపై నిఘా ఉంచుతాయి.
మూడు క్విక్ రెస్పాన్స్ టీమ్‌లతో పాటు ఎన్‌ఎస్‌జికి చెందిన ఒక టీమ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌కు చెందిన ఒక టీమ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్‌కి చెందిన పది బృందాలు కీలక ప్రదేశాల్లో మోహరిస్తారు.
వైద్య, పారామెడికల్ బృందాలు కూడా సిద్ధంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
ఏదైనా ఊహించని పరిస్థితిని ఎదుర్కొనేందుకు గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీతో సమన్వయంతో విపత్తు నిర్వహణ ప్రణాళిక మరియు అత్యవసర తరలింపు ప్రణాళిక కూడా సిద్ధం చేయబడ్డాయి.