67th Grammy Awards: 50 ఏళ్లల్లో నల్ల జాతీయుల చరిత్ర
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:43 PM
సంగీత రంగం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్ వేదికగా వైభవంగా జరిగింది. అమెరికాకు చెందిన సింగర్, బిజినెస్ వుమెన్ బియాన్స్ చరిత్ర సృష్టించింది.
సంగీత రంగం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గ్రామీ అవార్డుల (grammy awards)వేడుక లాస్ ఏంజెలెస్ వేదికగా వైభవంగా జరిగింది. గత ఏడాదికి సంబంధించి మ్యూజిక్ రంగంలో తమ సంగీతంతో ఉర్రూతలూగించిన గాయకులు, సంగీత దర్శకులు పురస్కారాలు అందుకున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన సింగర్, బిజినెస్ వుమెన్ బియాన్స్ (beyonce) చరిత్ర సృష్టించింది. గత 50 ఏళ్లలో గ్రామీ అవార్డు అందుకున్న తొలి నల్ల జాతీయురాలిగా బియాన్స్ రికార్డు సృష్టించింది. 11 మంది పోటీలో నిలవగా.. బియాన్స్ ఆలపించిన ‘కౌ బాయ్ కార్టర్’ (Cowboy Carter) ఆల్బమ్ గ్రామీ అవార్డు సొంతం చేసుకొంది. ’కౌ బాయ్ కార్టర్‘ ‘ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్’తోపాటు ‘బెస్ట్ కంట్రీ ఆల్బమ్’ గాను అవార్డు అందుకోవడం విశేషం.
భారత సంతతికి చెందిని వ్యాపారవేత్త చంద్రిక టాండన్ (Chandrika Tondon) ‘త్రివేణి’ ఆల్బమ్‌కు గానూ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియెంట్ ఆర్ చాంట్ కేటగిరీలో అవార్డు అందుకుంది. చంద్రిక ఈ పురస్కారం అందుకోవడం ఇది రెండోసారి. డై విత్ ఏ స్మైల్ ’ ఆల్బమ్ కు గానూ లేడీ గాగా, బ్రూనో మార్స్ కలిసి సంయుక్తంగా బెస్ట్ పాప్ డ్యుయో అవార్డు అందుకున్నారు.
ఇదే వేదికపై 'వాకా వాకా’ ఫేం క్వీన్ ఆఫ్ లాటిన్ మ్యూజిక్‌గా పేరొందిన షకీరా (Shakira) బెస్ట్ పాప్ ఆల్బమ్ కేటగిరీలో అవార్డును అందుకున్నారు. ఇది ఆమెకు నాలుగో గ్రామీ కాగా, లాటిన్ గ్రామీ అవార్డుల్లో 15వది. అంతే కాదు కొనేళ్ల తర్వాత ఆమె గ్రామీ వేదికపై బెల్లీ డాన్స్‌ను (Shakira Belly Dance) ప్రదర్శించింది. తాజాగా అందుకున్న అవార్డును ఆమె అమెరికాలో ఉంటున్న ఇమిగ్రెంట్స్‌కు డెడికేట్ చేస్తున్నట్లు చెప్పారు.