Avatar-3: అవతార్‌ -3 అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు

ABN , Publish Date - Jan 21 , 2025 | 02:31 PM

పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులో ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో మంత్రముగ్దుల్ని చేశారు దర్శకుడు. ఆ తర్వాత ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’తో మరో ట్రీట్‌ ఇచ్చారు. ఆ ఫ్రాంచైజీలో రానున్న మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందించనున్నారు



ప్రపంచ చిత్ర పరిశ్రమలో ‘అవతార్‌’ (Avatar-3) ఓ సంచలనాత్మక చిత్రం. హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ (James Cameron) సృష్టించిన ఓ అద్భుతమైన ప్రపంచమిది. పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులో ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌తో మంత్రముగ్దుల్ని చేశారు దర్శకుడు. ఆ తర్వాత ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’తో మరో ట్రీట్‌ ఇచ్చారు. ఆ ఫ్రాంచైజీలో రానున్న మూడో భాగాన్ని పంచభూతాల్లో ఒకటైన అగ్నికి సంబంధించిన కాన్సెప్ట్‌తో రూపొందించనున్నారు దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌.  ‘అవతార్‌- ఫైర్‌ అండ్‌ యాష్‌’ (Avatar Fire and Hash) పేరుతో రానున్న ఈ సినిమాపై జేమ్స్‌ కామెరూన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. గత రెండు చిత్రాలతో పోలిేస్త దీని నిడివి కూడా రెట్టింపు ఉంటుందన్నారు. ‘‘ప్రేక్షకు? అంచనాలకు మించి ఈ చిత్రం ఉంటుంది. తెరపై ఈ విజువల్‌ వండర్‌ను చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. గతంలోని రెండు చిత్రాల్లో చూపిన వాటిని ఎక్కడా పునరావృతం కాకుండా చూసుకుంటున్నాం. వాటికి బదులుగా కొన్ని ధైర్యమైన ఎంపికలతో మీ ముందుకు వస్తాను. ఇలా ధైౖర్యం చేసి కొన్నింటిని సృష్టించకపోతే ప్రతి ఒక్కరి సమయాన్ని, డబ్బును వృధా చేసిన వాడిని అవుతాను. రెండు భాగాల్లో లేని అద్భుతాలను  అవతార్‌ మూడో పార్ట్‌లో చూస్తారు. మీ అంచనాలకు మించిన లైవ్‌-యాక్షన్‌ని ఇందులో చూస్తారు.. మరో కొత్త ప్రపంచం భిన్నమైన కథనం, విభిన్నమైన పాత్రలు ఇందులో కనిపిస్తాయి. ఈసారి క్యారెక్టర్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నాం’’ అని అన్నారు. 2025 డిసెంబరు 19న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా. అవతార్‌ ఫ్రాంచైజీలో రానున్న ‘అవతార్‌ 4’ 2029లో, చివరిగా రానున్న ‘అవతార్‌ 5’ డిసెంబరు 2031లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది. 

Updated Date - Jan 21 , 2025 | 02:33 PM