Anuja in Oscars 2025: ‘అనూజ’.. ఆస్కార్ కొడుతుందా..

ABN , Publish Date - Jan 23 , 2025 | 11:57 PM

‘అనూజ’.. ఆస్కార్ కొడుతుందా! అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అందరూ ఆస్కార్ బరిలో ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ ఉంటుందని భావించగా.. ఫైనల్ నామినేషన్స్‌లో ఆ మూవీకి చోటు దక్కలేదు. కానీ ‘అనూజ’ మాత్రం 2025 ఆస్కార్స్‌లో నిలిచిన ఒకే ఒక్క భారతీయ చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది.

Anuja Still

ఆస్కార్ అవార్డులు-2025 (Oscars 2025) నామినేషన్స్‌ను గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ నామినేషన్స్‌ ఎప్పుడో ప్రకటించాల్సి ఉండగా.. లాస్‌ ఏంజెలెస్‌ను చుట్టుముట్టిన కార్చిచ్చు కారణంగా వాయిదా పడి.. గురువారం ప్రకటించాల్సి వచ్చింది. ఈ నామినేషన్స్‌లో ఒకే ఒక్క భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం దక్కింది. ప్రియాంకా చోప్రా ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ‘అనూజ’ (Anuja) సినిమాకు బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో చోటు లభించింది. ఈ విభాగంలో పరిశీలన కోసం ఏకంగా 180 సినిమాలు రాగా, వాటిలో కేవలం ఐదింటిని నామినేట్ చేశారు. ఆ ఐదింటిలో ‘అనూజ’ ఒకటి. ఈ షార్ట్ ఫిల్మ్‌ను ప్రియాంకా చోప్రా, గునీత్ మోంగా వంటి వారు నిర్మించగా ఆడమ్ జే గ్రావ్స్ దర్శకత్వం వహించారు.


Also Read- Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..

బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో అనూజతో పాటు ‘ఏలియన్, ఐయామ్ నాట్ ఏ రోబో, ది లాస్ట్ రేంజర్, ఏ మ్యాన్ హు వుడ్ నాట్ రిమైన్ సైలెంట్’ సినిమాలున్నాయి. ఈ ఐదింటిలో విజేతను ఆస్కార్ అవార్డుల వేడుకలో ప్రకటిస్తారు. మరి ఈ ఐదింటిలో ‘అనూజ’కు కచ్చితంగా అవార్డ్ వస్తుందని, రావాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. ప్రియాంకా చోప్రా బాలీవుడ్ పరిచయాలతో పాటు.. గునీత్ మోంగా సినిమాకు ఇది మూడో ఆస్కార్ ఎంట్రీ కానుండటంతో ఆయనకు ఈ అవార్డుల విషయంలో అన్ని తెలుసని, మళ్లీ ఆయన ప్రయత్నం ఫలిస్తుందనేలా అంతా మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు గునీత్ మోంగా నిర్మించిన ‘ది ఎలిఫెంట్ విస్పర్స్, పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ సినిమాలు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయి. ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో మార్చి 2వ తేదీన జరగబోతోంది.


‘అనూజ’ విషయానికి వస్తే.. బాల కార్మికుల జీవితాల్లోని చీకటి కోణాన్ని ఈ ‘అనూజ’ చిత్రంలో ఆవిష్కరించారు. బట్టల ఫ్యాక్టరీలో పని చేసే అనూజ అనే 9 ఏళ్ల పాప, ఆమె అక్క పాలక్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. సహజసిద్ధంగా తెరకెక్కిన ఈ ఫిల్మ్ అందరినీ ఆకర్షించింది. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు కూడా ప్రశంసించిన మరో సినిమా ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ మాత్రం ఆస్కార్ ఎంట్రీ సాధించలేకపోయింది. ఇంటా, బయటా విపరీతంగా ప్రశంసలు అందుకున్న ‘ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్’ కచ్చితంగా ఆస్కార్ ఎంట్రీ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. దీనిని బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్‌కు పంపించారు. అయితే ఆ సినిమా ఇతర చిత్రాలతో పోటీ పడలేకపోయింది. ఈ విషయంలో ఇండియన్స్ అంతా నిరాశలో ఉన్నారు.


Also Read- Poonam Kaur: నాకు పాలిటిక్స్ తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే..

Also Read- Saif Ali Khan: సైఫ్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‪కు రివార్డు.. ఆ రివార్డు ఏమిటంటే..

Also Read- Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌ డిశ్చార్జ్.. హాస్పిటల్ బిల్ ఎంత అయిందో తెలుసా?

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 24 , 2025 | 12:23 AM