97th OSCARS: అప్పుడు వాల్ట్ డిస్నీ.. ఇప్పుడు షాన్ బేకర్ సరికొత్త రికార్డు
ABN , Publish Date - Mar 03 , 2025 | 05:12 PM
ఎన్ని సినిమా అవార్డులు ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని అలరిస్తున్నా - ఆస్కార్ అవార్డ్స్ అందించే కిక్కే వేరని చెప్పాలా! వరల్డ్ వైడ్ సినీ ఫ్యాన్స్ ను ఈ సారి జరిగిన 97వ ఆస్కార్ వేడుకలు కూడా అలాగే అలరించాయి. ఇందులో చిత్ర విచిత్రాలు జరిగాయి.
ఎన్ని సినిమా అవార్డులు ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని అలరిస్తున్నా - ఆస్కార్ అవార్డ్స్అం (OSCARS) దించే కిక్కే వేరని చెప్పాలా! వరల్డ్ వైడ్ సినీ ఫ్యాన్స్ ను ఈ సారి జరిగిన 97వ ఆస్కార్ వేడుకలు కూడా అలాగే అలరించాయి. ఇందులో చిత్ర విచిత్రాలు జరిగాయి. 13 నామినేషన్స్ (13 Nominations) పొందిన నాన్- ఇంగ్లిష్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసిన ఫ్రెంచ్ మూవీ 'ఎమిలియా పెరేజ్' (Emilia perez) కేవలం రెండు అవార్డులతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ అంతర్జాతీయ చిత్రం రెండు విభాగాల్లోనూ నామినేషన్స్ పొందింది. అందువల్ల బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ (best intertnational Award)) అవార్డును కైవసం చేసుకుంటుందని పలువురు భావించారు. అయితే కేవలం ఉత్తమ సహాయనటి, ఉత్తమ సంగీతం (ఒరిజినల్ సాంగ్)తో సరిపుచ్చుకోవలసి వచ్చింది. ఉత్తమ నటుడు ఆడ్రియెన్ బ్రాడీ తన కెరీర్ లో రెండు సార్లు బెస్ట్ యాక్టర్ గా నామినేషన్ పొందారు. రెండు సార్లూ విజేతగా నిలవడం విశేషం! ఇక 'అనోరా' సినిమాతో బెస్ట్ డైరెక్టర్ గా నిలచిన షాన్ బేకర్ (Sean Baker) ఓ సరికొత్త రికార్డును సృష్టించారు.
షాన్ బేకర్ (Sean Baker) తన కెరీర్ లో మొట్టమొదటిసారి 'అనోరా' (Anora) చిత్రంతో నాలుగు అకాడమీ నామినేషన్స్ సంపాదించారు. ఆ నాలుగు అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం! అంతేకాదు ఆస్కార్ అవార్డుల వేడుకలో ఒకేసారి ఒకే సినిమాతో నాలుగు అవార్డులు దక్కించుకున్న ఏకైక వ్యక్తిగానూ నిలిచారు షాన్ బేకర్. 'అనోరా' సినిమా ద్వారా బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రైటర్, బెస్ట్ ఎడిటర్ అవార్డులను షాన్ సొంతం చేసుకున్నారు. గతంలో వాల్ట్ డిస్నీ 1953 సంవత్సరంలో ఒకే వేడుకలో నాలుగు అవార్డులు సొంతం చేసుకున్నారు. అయితే వాల్ట్ వేర్వేరు సినిమాల ద్వారా నాలుగు ఆస్కార్లు అందుకోవడం గమనార్హం! అప్పట్లో బెస్ట్ యానిమేషన్, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్, బెస్ట్ టూ రీల్ షార్ట్ - విభాగాల్లో వాల్ట్ డిస్నీ నాలుగు ఆస్కార్లను సొంతం చేసుకున్నారు. షాన్ బేకర్ ఒకే సినిమా 'అనోరా'తోనే అందునా నాలుగు ప్రధాన విభాగాల్లో విజేతగా నిలవడమన్నది విశేషాలకే విశేషం! అలా 97వ ఆస్కార్ వేడుకల్లో షాన్ బేకర్ ఓ అరుదైన చరిత్రను లిఖించారు.