OSCAR 2025: ఆస్కార్ అవార్డు విజేతలు వీరే

ABN , Publish Date - Mar 03 , 2025 | 12:03 PM

ఆస్కార్ అవార్డులు పంచే ఆనందం, పెంచే ఉత్సాహం వేరుగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ  అకాడమీ అవార్డుల వేడుక మార్చి 3వ తేదీ ఉదయం 5.30 గంటలకు మొదలయింది.

ఆస్కార్ అవార్డులు (97th Oscar Awards) పంచే ఆనందం, పెంచే ఉత్సాహం వేరుగా ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా సినిమా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ  అకాడమీ అవార్డుల వేడుక మార్చి 3వ తేదీ ఉదయం 5.30 గంటలకు మొదలయింది. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందు రెడ్ కార్పెట్ పై మేటి నటీనటులు  సందడి చేశారు. 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో 23 విభాగాల్లో ప్రతిభావంతులు పురస్కారాలు అందుకున్నారు.  ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకుంది. ‘ది బ్రూటలిస్ట్‌’లో (The Brutalist) నటనకు గానూ ఉత్తమ నటుడిగా అడ్రియన్‌ బ్రాడీ.. ‘అనోరా’లో(Anora) నటనకు మైకీ మ్యాడిసన్‌ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. సీన్‌ బేకర్‌ (అనోరా) ఉత్తమ దర్శకుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు.

ఈసారి ఆస్కార్ అవార్డుల్లో బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లేగా అనోరా (సీన్ బేకర్) నిలిచింది. బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లేగా కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాఘన్) పురస్కారాన్ని సొంతం చేసుకుంది. బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్‌కు ది సబ్‌స్టెన్స్ ఎంపికైంది. కాగా, ఈ అవార్డుల ప్రదానోత్సవ వేడుకకు వచ్చిన గెస్ట్‌లతో నటి, వ్యాఖ్యాత అమేలియా డిమోల్డెన్‌బర్గ్ చిట్‌చాట్ చేశారు. చాలా మంది సినీ ప్రముఖులతో ఆమె మాట్లాడారు. ఈ వేడుకను ఏబీసీ, జియో హాట్‌స్టార్, స్టార్ మూవీస్, హులు, యూట్యూబ్ టీవీ, ఫుబోటీవీ, ఏటీ అండ్ టీ టీవీలు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాయి. (97th oscar winners)


అవార్డు గ్రహీతలు వీరే..

ఉత్తమ చిత్రం - అనోరా

ఉత్తమ నటుడు - అడ్రియన్‌ బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌)

ఉత్తమ నటి - మైకీ మ్యాడిసన్‌ (అనోరా)

ఉత్తమ దర్శకత్వం - అనోరా (సీన్‌ బేకర్‌)

ఉత్తమ సహాయ నటుడు - కీరన్‌ కైల్‌ కల్కిన్‌ (ది రియల్‌ పెయిన్‌)

ఉత్తమ సహాయ నటి - జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)

ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనోరా (సీన్‌ బేకర్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ - ది బ్రూటలిస్ట్‌ (లాల్‌ క్రాలే)

ఉత్తమ సౌండ్‌ - డ్యూన్‌: పార్ట్‌2

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ - డ్యూన్‌:పార్ట్‌2

ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ - ఎల్‌ మాల్‌ (ఎమిలియా పెరెజ్‌)

ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ - ఐయామ్‌ స్టిల్‌ హియర్‌ (వాల్టర్‌ సాల్లెస్‌- బ్రెజిల్‌)

ఉత్తమ ఒరిజినల్‌ స్కోర్‌ - ది బ్రూటలిస్ట్‌ (డానియల్‌ బ్లమ్‌బెర్గ్‌)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌ - వికెడ్‌

ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ - ఐయామ్‌ నాట్‌ ఏ రోబో

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌- ది ఓన్లీ గర్ల్ ఇన్‌ ది ఆర్కెస్ట్రా

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ - నో అదర్‌ ల్యాండ్‌

ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ - ఫ్లో

ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌ - ఇన్‌ ది షాడో ఆఫ్‌ ది సైప్రెస్‌

ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే - కాన్‌క్లేవ్‌ (పీటర్‌ స్ట్రాగన్‌)

ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ - వికెడ్‌ (పాల్‌ తేజ్‌వెల్‌)

ఉత్తమ మేకప్‌, హెయిల్‌స్టైల్‌ - ది సబ్‌స్టాన్స్‌

ఉత్తమ ఎడిటింగ్ - అనోరా (సీన్‌ బేకర్‌)

Updated Date - Mar 03 , 2025 | 12:07 PM