Viral Prapancham: టెక్నాలజీతో వచ్చే సమస్యలతో వైరల్ ప్రపంచం..
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:47 AM
ప్రస్తుతం నడిచేది డిజిటల్ యుగం. డిజిటల్‌కు అలవాటు పడి జనాలకు టెక్నాలజీ ఎంత మంచి చేస్తుందో అంతే చెడూ చేస్తుంది. సవాళ్లూ కూడా అంతే! అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి.
ప్రస్తుతం నడిచేది డిజిటల్ యుగం. డిజిటల్‌కు అలవాటు పడి జనాలకు టెక్నాలజీ ఎంత మంచి చేస్తుందో అంతే చెడూ చేస్తుంది. సవాళ్లూ కూడా అంతే! అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి జీవితాలు తారుమారు అవుతాయి. ప్రాణాలను కూడా తీస్తాయి. ఆ తరహా కథతో తెరకెక్కిన చిత్రం ‘వైరల్ ప్రపంచం’. వాస్తవ సంఘటనల ఆధారంగా ప్రియాంక శర్మ(Priyanka SHarma), నిత్యా శెట్టి(nithya Shetty), సాయి రోనక్(Sai Ronak), సన్నీ, నవీన్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రమిది. బ్రిజేష్ టాంగి దర్శకత్వంలో, నిర్మాత అకిల తంగి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ఎలా ఉందో చూద్దాం. (ViralPrapranchamReview,)
కథ:
తెలుగమ్మాయి స్వప్న(ప్రియాంక శర్మ) అమెరికాలో ప్రేమలో పడుతుంది. అక్కడ తెలుగబ్బాయి రవి(సాయి రోనక్)తో నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగిస్తుంటుంది. ఆ ప్రేమని కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటుంది. మరోవైపు ఒంటరిగా జీవిస్తున్న అదితి (నిత్యశెట్టి) అనే అమ్మాయి సోషల్ మీడి?యా ఫ్లాట్‌ఫామ్‌లో ప్రవీణ్ (సన్నీ నవీన్) అనే అబ్బాయితో పరిచయం పెంచుకుంటుంది. వీరిద్దరి ేస్నహం ప్రేమగా మారుతుంది. ఇద్దరు ఎమోషనల్‌గా క్లోజ్ కావాలనుకుంటారు. ఈ క్రమంలో అటు స్వప్న, ఇటు అదితి తమ లవర్స్‌ని దక్కించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. వాళ్లు ఎక్కువగా తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను, ఇంటర్నెట్‌ను నమ్ముతారు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఓ ప్రళయం. ఆశలన్నీ అడియాశలు అవుతాయి. నమ్మకాలపై దెబ్బ పడుతుంది. మరి వారి నమ్మకాన్ని దెబ్బకొట్టింది ఎవరు? ప్రాణాలను బలిగొన్న ఘటన ఏంటీ? అనంతరం ఆ కథ ఎలాంటి టర్న్ తీసుకుందనేది మిగిలిందనేది కథ. (Viral Prapancham Review)
విశ్లేషణ:
డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో.. అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి జీవితాలు తారుమారు అవుతుంటాయి. అవి కొన్నిసార్లు ప్రాణాల మీదకూ తెస్తుంది. ఆ తరహా జానర్ కథ ఇదిజ టెక్నాలజీ, సోషల్ మీడియా, డిజిటల్ రంగంలో మనిషి దేనికి ప్రయారిటీ ఇస్తున్నారనేది ఇందులో చెప్పే ప్రయత్నం చేశారు. ఏది మంచి, ఏది చెడు. దేనిని ఎంత వరకు వాడుకోవాలి అనేది చూపించారు. నేటి ట్రెండ్‌ని, యువత పోకడలను ఆవిష్కరించిన సినిమా ఇది. మన ప్రపంచంలో ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా చూస్తాం. కానీ నిజానికి ఆ మనిషి చాలా వేరు అయ్యిండొచ్చు’’ అంటూ కనెక్ట్ అయ్యే డైలాగ్‌తో అసలు కథ మొదలవుతుంది. అమ్మాయి భవనంపై నుండి దూకడంతో ప్రారంభమయ్యే సస్పెన్స్ రిలేషన్ షిప్ డ్రామా, కథ మొత్తం కంప్యూటర్ స్ర్కీన్‌లు, వరుస వీడియో కాల్స్, అనేక యూట్యూబ్ వీడియోలు సోషల్ మీడియా కథనాల సేకరణ, అక్కడక్కడా టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారానే జరుగుతుంది. ఈ కథ వర్చువల్ ప్రపంచంలో సంబంధాలు ఎలా విడిపోతాయి, ఉన్నత చదువుల కోసం సుదూర సంబంధాలను, సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఈ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తున్నారో చెప్పారు. ఈ కాలంలో ఇంటర్నెట్‌లో యువతులు, మహిళల గోప్యతను మంటగలుపుతున్న సైబర్ నేరాన్ని కూడా కళ్లకు కట్టినట్టు చూపించారు. సినిమా ఆద్యంతం థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని ఇస్తుంది. కొన్ని సస్పెన్స్ అంశాలు ఎంగేజింగ్‌గా ఉన్నాయి. ‘ఇంటర్నెట్‌లో చాలా రహస్యాలు ఉంటాయి. కానీ ఏ రహస్యం కూడా దాగదు’ అనే ఈ సినిమాలోని డైలాగ్ మాదిరిగానే తాను చెప్పాలనుకున్న సబ్జెక్టును తెరకెక్కించడంతో సక్సెస్ అయ్యాడు దర్శకుడు బ్రిజేష్ టాంగి. వీడియో కాల్స్, స్ర్కీన్ రికార్డింగ్ వల్ల వారి జీవితాలని ఎలా మారిపోయాయి అనేది నేటి యువతకు అర్థమయ్యేలా స్ర్కీన్‌పై ఆవిష్కరించాడు. కంప్యూటర్ స్ర్కీన్‌లపై జరిగే ఒక ఉత్కంఠభరితమైన కథనం, ఇది సుదూర సంబంధాలను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఈ సంబంధాలు ఎలా ప్రభావితమవుతున్నాయో చెప్పిన తీరు ఆలోచింపజేస్తుంది. యధార్థ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో చక్కని సందేశం ఉంది. యువతకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. కథ వేగమైనదే అయినా స్ర్కీన్‌ప్లే మాత్రం నత్తనడకన సాగుతుంది. రిలేషన్స్‌ను ఇంకాస్త డెప్త్‌గా చూపించాల్సింది. చెడు దారుల్లో పయనమవుతున్న యువతకు షుగర్ కోటింగ్‌లో చెబితే ఇంకా బాగుండేది.
నటీనటుల పని తీరుకొస్తే. రవి పాత్రలో సాయి రోనక్, స్వప్న పాత్రలో ప్రియాంక శర్మ, అదితి పాత్రలో నిత్యశెట్టి, ప్రవీణ్ పాత్రలో సన్నీ నవీన్ చక్కగా నటించారు. ఈ తరం యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపించారు. సహజంగా నటించే ప్రయత్నం చేశారు. లవ్ సీన్లు, వారు చేసే పనులు రియాలిటీకి దగ్గరగా ఉండటంతో బాగా కనెక్ట్ అవుతాయి. మిగతా పాత్రధారులు ఫర్వాలేదనిపించారు. టెక్నికల్ విషయానికొస్తే.. కెమెరా వర్క్ ప్లజంట్‌గా ఉంది. సంగీతం ఎసెట్ అయింది. ఆర్‌ఆర్ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు.
ట్యాగ్‌లైన్: యువతకు సందేశం