Jewel Thief : జువెల్ థీఫ్ రివ్యూ (ఓటీటీ మూవీ)

ABN , Publish Date - Apr 26 , 2025 | 07:11 PM

ఫక్తు బాలీవుడ్ మసాలా మూవీస్ పంథాలో 'జువెల్ థీఫ్' తెరకెక్కింది. ఈ చిత్రాన్ని రాబీ గ్రేవాల్, కూకీ గులాటీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ నిర్మించారు. ఏప్రిల్ 25 నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

దొంగతనాలు, దోపిడీలపై రూపొందిన 'మనీ హేస్ట్' వెబ్ సిరీస్ ఓటీటీలో విశేషాదరణ చూరగొంది. ఆ స్ఫూర్తితోనే కాబోలు 'జువెల్ థీఫ్ - ద హేస్ట్ బిగిన్స్ ' (Jewel Thief) అనే ఓటీటీ మూవీ రూపొందింది. సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan), జయదీప్ అహ్లావత్ (Jayadeep Ahlawath) నికితా దత్తా (Nikita Dutta), కునాల్ కపూర్ (Kunal Kapoor), కుల్ భూషణ్ కర్బందా, గగన్ అరోరా వంటి పేరున్న నటులు నటించడం వల్ల 'జువెల్ థీఫ్ - ద హేస్ట్ బిగిన్స్' కూడా జనాన్ని ఆకర్షిస్తోంది. ఫక్తు బాలీవుడ్ మసాలా మూవీస్ పంథాలోనే 'జువెల్ థీఫ్' తెరకెక్కింది. ఈ చిత్రాన్ని రాబీ గ్రేవాల్, కూకీ గులాటీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ నిర్మించారు. ఏప్రిల్ 25 నుండి ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


కథ విషయానికి వస్తే...

రెహన్ రాయ్ తండ్రి ఓ డాక్టర్. పేదసాదలకు సాయం చేస్తూ ఉంటాడు. తన తండ్రి నిరాదరణ వల్లే తన తల్లి చనిపోయిందని రెహన్ భావిస్తాడు. తప్పుడు మార్గంలో పయనిస్తాడు. తండ్రికి, కొడుకుకు మధ్య దూరం పెరుగుతుంది. ప్రపంచంలోని అతిఖరీదైన వజ్రాల ఆభరణాలను, నిధులను దోచేసుకుంటూ ఉంటాడు. బుడాపెస్ట్ లో ఉంటాడు. రెహన్ తండ్రి క్లినిక్ ను రాజన్ ఔలఖ్ అనే ఆర్ట్ కలెక్టర్ ఆక్రమించి ఉంటాడు. పేరుకు ఆర్ట్ కలెక్టర్ అయినా అతిఖరీదైన ఆభరణాలను కొల్లగొట్టడమే అతని ధ్యేయం. అతను రెహన్ తండ్రిని ఓ విషయంలో వేధిస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని తమ్ముడు అవి రాయ్ ద్వారా తెలుసుకుంటాడు రెహన్. రాజన్ నుండి తన తండ్రిని కాపాడాలని ఆశిస్తాడు రెహన్. అందులో భాగంగా రాజన్ 'రెడ్ సన్' అనే అతి ఖరీదైన రూబీ డైమండ్ ను తెచ్చివ్వమని రెహన్ ను కోరతాడు. మరోవైపు సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్ విక్రమ్ పటేల్, జువెల్ థీఫ్ ను పట్టుకొనే ప్రయత్నంలో ఉంటాడు. అసలైన రెడ్ సన్ ను దొంగిలించి దానిస్థానంలో నకిలీది పెడతాడు రెహన్. ఈ దోపిడిలో రెహన్ కు రాజన్ భార్య ఫరా సహకరిస్తుంది. చివరకు రాజన్ చస్తాడు. మరో దొంగతనానికి రెహన్, ఫరా ప్లాన్ చేస్తూండగా 'ద హేస్ట్ కంటిన్యూస్...' అంటూ సీక్వెల్ కు సిగ్నల్ఇస్తుంది.

ఎలా ఉందంటే...

కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోయినా దోపిడీ చిత్రాలను రూపొందించడంలో బాలీవుడ్ బాణీ ప్రత్యేకంగా నిలచింది. దానిని అనుసరిస్తూ గ్రాండియస్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. రెహన్ గా సైఫ్ అలీఖాన్, రాజన్ గా జైదీప్ అహ్లావత్, ఫరాగా నికితా దత్, విక్రమ్ పటేల్ గా కునాల్ కపూర్ తమ పాత్రలకు తగ్గ అభినయం ప్రదర్శించారు. సచిన్ జిగర్ స్వరాలలో రూపొందిన నాలుగు పాటల్లో టైటిల్ ట్రాక్ పరవాలేదనిపిస్తుంది. "లూటేరా..." అంటూ సాగే పాట కూడా ఆకట్టుకుంటుంది. ఏది ఏమైనా కొత్త సీసాలో పాత సారాలాగా 'జువెల్ థీఫ్ - ద హేస్ట్ బిగిన్స్' సాగింది. దేవానంద్ 'జువెల్ థీఫ్' తరువాత మరికొన్ని అదే టైటిల్ తో వచ్చినా అంతగా ఆకట్టుకోలేక పోయాయి. ఈ మధ్య కాలంలో హాలీవుడ్ మూవీస్ లోని దోపిడీ సీన్స్ చూసిన వారికి ఇది అంతగా ఎక్కదు. ఏది ఏమైనా సైఫ్, జైదీప్, నికితా కోసం ఓ సారి చూడొచ్చు అనిపిస్తుంది.

ట్యాగ్ లైన్ : సరిగా సాగని దోపిడి!

రేటింగ్ - 2.5/ 5

Also Read: Thudarum Movie: తుడరుమ్ మూవీ రివ్యూ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 26 , 2025 | 07:11 PM