Pattudala Review: అజిత్ ‘పట్టుదల’ ఎలా ఉందంటే..
ABN , Publish Date - Feb 06 , 2025 | 04:44 PM
తల అజిత్ (Ajith Kumar) సినిమాలకు ఓ క్రేజ్ ఉంటుంది. ఆయన కథల ఎంపిక డిఫరెంట్‌గా ఉంటుంది. యాక్షన్ జానర్ చిత్రాలు చేయడంలో డిఫరెంట్ స్కూల్ ఆయనది. కారు రేసింగ్ సన్నివేశాలు వంటివి డూప్ లేకుండా తన సొంతగా చేసేస్తారు అజిత్. హాలీవుడ్ తరహాలో స్టైలిష్ యాక్షన్ సినిమాలు ఇప్పటికే ఆయన చాలా చేసి విజయాలు అందుకున్నారు.
సినిమా రివ్యూ: పట్టుదల(విడాముయార్చి-Pattudala Review)
విడుదల తేది: 6-2-2025
థియేటర్: AAA సినిమాస్
నటీనటులు: అజిత్9Ajith Kumar), త్రిష, అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా, ఆరవ్, రమ్య సుబ్రమణ్యియన్, రవి రాఘవేంద్ర తదితరులు
సాంకేతిక నిపుణులు:
డిఓపి: ఓం ప్రకాష్
సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్
ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్
నిర్మాత: లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్
దర్శకత్వం: మగిళ్ తిరుమేని (Magizh Thirumeni)
తల అజిత్ (Ajith Kumar) సినిమాలకు ఓ క్రేజ్ ఉంటుంది. ఆయన కథల ఎంపిక డిఫరెంట్‌గా ఉంటుంది. యాక్షన్ జానర్ చిత్రాలు చేయడంలో డిఫరెంట్ స్కూల్ ఆయనది. కారు రేసింగ్ సన్నివేశాలు వంటివి డూప్ లేకుండా తన సొంతగా చేసేస్తారు అజిత్. హాలీవుడ్ తరహాలో స్టైలిష్ యాక్షన్ సినిమాలు ఇప్పటికే ఆయన చాలా చేసి విజయాలు అందుకున్నారు. యాక్షన్ సినిమాల్లో అజిత్ సినిమాలు వేరు అనేలా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన యాక్షన్ సినిమా 'విడా ముయర్చి’. తెలుగులో 'పట్టుదల’ (Pattudala Movie) పేరుతో విడుదల చేశారు. త్రిష హీరోయిన్. యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. మగిళ్ తిరుమేని (Magizh Thirumeni) దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా వాయిదా పడి ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్, యాక్షన్ జానర్‌కు కేరాఫ్ అయిన అజిత్ ుపట్టుదల’తో విజయం అందుకున్నారా? లేదా చూద్దాం.
కథ: (Pattudala movie Review)
అర్జున్ (అజిత్ కుమార్), కాయల్ (త్రిష) ప్రేమ వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడతారు. 12 ఏళ్ల జర్నీ తర్వాత వ్యక్తిగత కారణాలతో భర్తతో విడిపోవాలనుకుంటుంది కాయల్. అంతే కాదు మరో వ్యక్తితో ప్రేమలో పడుతుంది. విడాకులకు అర్జున్ అంగీకరిస్తాడు. అప్పటి వరకూ తన పుట్టింట్లోనే ఉండాలనుకుంటుంది కాయల్. తానే స్వయంగా పుట్టింట్లో డ్రాప్ చేస్తాను అని, ఇదే మనం కలిసి చేసే మెమరబుల్ జర్నీ అని చెప్పి అర్జున్ కాయల్‌ను కారులో తీసుకెళ్లాడు. మార్గ మధ్యలో దీపికా(రెజీనా), రక్షిత్ (అర్జున్) పరిచయమవుతారు. కారు చెడిపోవడంతో హైవేలో దీపిక కాయల్‌కు లిఫ్ట్ ఇస్తుంది. వాళ్లతో వెళ్లిన తర్వాత కాయల్ మిస్ అవుతుంది. అక్కడి నుంచి ఏం జరిగింది. దీని వెనుక ఉన్నది ఎవరు? కిడ్నాప్ అయిన తన భార్య కాయల్‌ను అర్జున్ ఎలా దక్కించుకున్నాడు అన్నది కథ.
విశ్లేషణ: (Pattudala movie Review)
ఈ సినిమా ట్రైలర్ చూడగానే 1997లో వచ్చిన అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్రేక్ డౌన్’ సినిమాను అడాప్ట్ చేసుకుని తెరకెక్కించినట్లుగా అర్థమైంది. రీమేక్ అని చెప్పకపోయినా చిన్న చిన్న క్యారెక్టర్ల మార్పులతో సినిమా తీశారు. డబ్బు కోసం కిడ్నాప్ చేయడం, వారిని చిత్రవధ చేయడం, విదేశాలకు తరలించడం, అవయవాలను అమ్ముకోవడం తదుపరి హీరో సంబంధీకులను వెతుక్కుంటూ వెళ్లడం విలన్లకు బుద్ధి చెప్పి తన వాళ్లను రక్షించి వెనక్కి తీసుకురావడం వంటి రివేంజ్ డ్రామాలు దక్షిణాది సినిమాకు కొత్తేమీ కాదు. కాదు. కానీ అజిత్ ఓ సినిమా చేశారు అంటే అందులో ఏదో ఒక ఆసక్తికర అంశం ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులకు నమ్మకం. అదే ఈ చిత్రంలో మిస్ అయింది.
అజిత్ హీరోయిజం, ఆయన రేంజ్ సినిమా కాదిది. ఈతరం హీరోలు చేయాల్సిన చిత్రమిది. దక్షిణాది ప్రేక్షకులు అలవాటు పడిన కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా తను అనుకున్న కథను అలా తీసుకువెళ్లాడు. ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న అజిత్, త్రిష కథతో లవ్ సోల్ కనిపించలేదు. అజిత్, త్రిష ఎందుకు విడిపోతున్నారు అనడానికి బలమైన కారణం చూపించలేదు. త్రిష మిస్ అయినప్పుడు అజిత్ పడే బాధకు ప్రేక్షకులు అంతగా చేరువ కాలేకపోయారు. పైగా విలన్లు హీరోను ఎంత రెచ్చగొట్టినా, యాక్షన్ సీన్స్‌లో హీరోను చితకొట్టిన సన్నివేశాలను అభిమానులు యాక్ట్సెప్ట్ చేయలేదు. రియలిస్టిక్‌గా కథ చెప్పాలనుకున్నారని అనుకోవాలంతే. అజర్‌బైజాన్ వంటి ప్రాంతంలో ఛేజింగ్‌లు, సన్నివేశాలు ట్విస్టులు ఆసక్తికరంగా సాగాయి. అయితే పెట్రోల్ బంక్‌లో త్రిష, రెజీనాల పరిచయం, హాయ్ కూడా చెప్పకుండా రెజీనా రూట్ మ్యాప్ చెప్పడం వంటివి చూడగానే.. ముందు ఏం జరగబోతోందో ఊహించడానికి దర్శకుడు స్కోప్ ఇచ్చారు. అర్జున్ పరిచయంతో జరగబోయే దానికి కారకులు వీరే అని క్లియర్‌గా తెలిసిపోయింది. ఇదంతా చెప్పడానికి ఇంటర్వెల్ వరకూ టైమ్ తీసుకున్నాడు దర్శకుడు.
రీమేక్, హాలీవుడ్ స్థాయి స్టైలిష్ మేకింగ్ అంతా బాగానే ఉంది. కానీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంతో దర్శకుడు తడబడ్డాడు. అసలు కథేంటో చెప్పడానికి బాగా టైమ్ తీసుకున్నారు. ఇంటర్వెల్ తర్వాతే కథ ముందుకు కదులుతుంది. అక్కడి నుంచి సన్నివేశాలు ట్విస్ట్‌లు ఆకట్టుకుంటాయి. విలన్లుగా ఉన్న దీపిక, రక్షిత్‌ల నేపథ్యాన్ని హీరో అడగ్గానే చెప్పడంతో ఆ సీన్ చల్లబడిపోయింది. అక్కడి నుంచి సన్నివేశాలన్నీ సోసోగా సాగాయి. యాక్షన్ సీక్వెన్సుల్లో అజిత్ ఎక్కడా తగ్గలేదు. అయితే సినిమాలో భావోద్వేగాలు మిస్ అయ్యాయి. (Ajith's Pattudala movie Review)
నటీనటుల పనితీరు: దర్శకుడు కథలో చెప్పారో అలా చేసుకువెళ్లారు అజిత్. నటన, యాక్షన్ సన్నివేశాల విషయంలో ఎక్కడా పేరు పెట్టడానికి లేదు. అజిత్ యంగ్ ఏజ్ సీన్స్ మెస్మరైజ్ చేశాయి. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నారు. త్రిష ఎప్పటిలాగే అందంగా, చక్కని అభినయం ప్రదర్శించింది. ఒక డిజార్డర్‌తో బాధపడుతున్న యువతిగా రెజీనా క్యారెక్టర్‌లో బాగా యాక్ట్ చేసింది. ఆ పాత్రను ఇంకాస్త బలంగా ఉపయోగించుకుని ఉంటే బావుండేది. అర్జున్ సర్జా పాత్రకు న్యాయం చేశారు. నటన పరంగా పరిధి మేరకు నటించారు. మిగిలిన పాత్రల్లో ఫారినర్స్ అంతా ఓకే అనిపించారు. (Pattudala movie Review)
ఇక టెక్నికల్ విషయానికొస్తే.. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ సినిమాకు మెయిన్ ఎసెట్. ప్రతి సీన్‌ను అద్భుతంగా చిత్రీకరించారు. అజర్‌బైజాన్ ఏరియాను రియలిస్టిక్‌గా చూపించారు. ఛేజింగ్ సన్నివేశాల్లో డ్రోన్ షాట్స్ అదిరిపోయాయి. విజువల్స్ హాలీవుడ్ స్టైల్‌లో అనిపిస్తాయి. అనిరుద్థ్ సంగీతం ఓకే. పాటలు అంతగా గుర్తుపెట్టుకునేలా లేవు. యాక్షన్ సీన్స్‌లో ఆర్‌ఆర్ మాత్రం బాగా కొట్టాడు. టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంది. లైకా సంస్థ నిర్మాణ విలువలు బావున్నాయి. అయితే తెలుగు అనువాదం విషయంలో జాగ్రత్తలు తీసుకోలేదు. హీరో హీరోయిన్లకు డబ్బింగ్ సూట్ కాలేదు. ముఖ్యంగా అజిత్ నుంచి అభిమానులు కోరుకునే మాస్ అంశాలు సినిమాలో లేవు. దర్శకుడు ఈతరం ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని పాత్రల్ని డిజైన్ చేశారు. సినిమాను స్టైలిష్‌గా చూపించారు. కథ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఎలాంటి ప్రమోషన్ లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మాత్రం మెప్పిస్తుందో చూడాలి.
ట్యాగ్‌లైన్: పేరుకే పట్టుదల.. అభిమానులకు మాత్రం...