Navneeth Kour: నవనీత్ కౌర్ ఇంట తీవ్ర విషాదం
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:14 PM
ఒకప్పటి కథానాయిక, ప్రస్తుత రాజకీయ నాయకురాలు నవనీత్ కౌర్ తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు.
రెండు దశాబ్దాల క్రితం ఆర్.పి. పట్నాయక్ (R.P. Patnayak) హీరోగా పరిచయం అయిన 'శీను వాసంతి లక్ష్మీ' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నవనీత్ కౌర్ (Navneet Kaur). ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాలలో నటించాయి. అందులో కొన్ని ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టగా మరికొన్ని పరాజయం పాలయ్యాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ చిత్రాలలోనూ నటించింది నవనీత్ కౌర్. ఆ తర్వాత మహారాష్ట్రలోని రాజకీయ నేత రవి రాణా (Ravi Rana)ని ఆమె 2011లో పెళ్ళాడారు. భర్త అడుగు జాడల్లో నడుస్తూ నవనీత్ కౌర్ సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019లో అమరావతి పార్లమెంట్ నుండి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఆమె 2024లో బీజేపీలో చేరి, ఆ పార్టీ తరఫున పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయారు. ఆమె భర్త రవి రాణా ఇప్పుడు ఎమ్మెల్యేగా సేవలు అందిస్తున్నారు.
అయితే కొంతకాలంగా నవనీత్ కౌర్ తల్లి రాజీందర్ కౌర్ హర్ భజన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం ఆమె హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. 61 సంవత్సరాల రాజీందర్ కౌర్ పార్ధీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం కొంతసేపు ఉంచి, ఆ తర్వాత అంత్యక్రియలను నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు నవనీత్ కౌర్ తల్లి మృతి పట్ల సంతాపం తెలిపారు.
Also Read: Robinhood: హుక్ స్టెప్స్ పై విమర్శల వెల్లువ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి