Sabdham Review: సినిమా రివ్యూ:‘శబ్దం’

ABN , Publish Date - Feb 28 , 2025 | 09:14 AM

ఆది పినిశెట్టి డిఫరెంట్‌ జానర్‌ సినిమాలు చేస్తుంటారు. మూస పద్దతలో కాకుండా వైవిధ్యమెన పాత్రలు ఎంచుకుంటారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘శబ్దం’. కెరీర్‌ బిగినింగ్‌లో ‘వైశాలి’ వంటి విజయవంతమైన సినిమా ఇచ్చిన అరివళగన్‌ తీసిన సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌ ఇది.

సినిమా రివ్యూ:‘శబ్దం’ (Sabdham Movie Review)


విడుదల తేది: 28–2–2025
నటీనటులు: ఆది పినిశెట్టి,(Aadi Pinisetty) లక్ష్మీ మీనన్‌, (Lakshmi menen) సిమ్రాన్‌, లైలా, రెడిన్‌ కింగ్‌స్లే, రాజీవ్‌ మీనన్‌ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: అరుణ్‌ బి
సంగీతం: తమన్‌
ఎడిటింగ్‌: వీజే సబు జోసెఫ్‌
నిర్మాతలు: శివ, భానుప్రియ శివ
దర్శకత్వం:  అరివళగన్‌ (Arivazhagan Venkatachalam)

ఆది పినిశెట్టి డిఫరెంట్‌ జానర్‌ సినిమాలు చేస్తుంటారు. మూస పద్దతలో కాకుండా వైవిధ్యమెన పాత్రలు ఎంచుకుంటారు. తాజాగా ఆయన నటించిన చిత్రం ‘శబ్దం’. కెరీర్‌ బిగినింగ్‌లో ‘వైశాలి’ వంటి విజయవంతమైన సినిమా ఇచ్చిన అరివళగన్‌ తీసిన సూపర్‌ నేచురల్‌ హారర్‌ థ్రిల్లర్‌ ఇది. తెలుగు, తమిళ భాషల్లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది? హారర్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం మెప్పించిందా? రివ్యూలో చూద్దాం.

కథ:
వ్యోమ వైద్యలింగం (ఆది పినిశెట్టి) ఘోస్ట్‌ ఇన్వెస్టిగేటర్‌. కేరళలోని ఓ మెడికల్‌ కాలేజీలో వరుసగా ఇద్దరు స్టూడెంట్స్‌ ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. కాలేజీ పరువు కు సంబంధించిన విషయం కావడంతో ఆ హత్యల వెనకున్న కారణం ఏంటో తెలుసుకోవడానికి వ్యోమను పిలుస్తారు. ఆ కాలేజ్‌ అడుగుపెట్టాక వ్యోమాకి ఎదురైన సవాళ్లు ఏంటి? అవంతిక (లక్ష్మీ మీనన్‌) చుట్టూ దెయ్యాలు ఎందుకు ఉన్నాయి? ఆమె ఎవరు? 34 ఏళ్లుగా కాలేజీ యజమాని డేనియల్‌ భార్య డయానా (సిమ్రాన్‌ -Simran)) ఎందుకు కోమాలో ఉంది. నాన్సీ డేనియల్‌ (లైలా -Laila) ఎవరు? 42 దెయ్యాల కథ ఏమిటి? వాటి టార్గెట్‌ ఎవరు?  అనేది సినిమా.


విశ్లేషణ:
హారర్‌ జానర్‌ చిత్రాలంటే వీక్షకులకు ఓ క్రేజ్‌ ఉంటుంది. చాలా మంది మేకర్స్‌ ఈ జానర్‌ ఎంచుకున్నప్పుడు భయ పెట్టాలి అనే ఫార్మాట్‌లోనే వెళ్తారు. ఆ తరహా ఫార్మెట్‌ అయ్యే వాళ్ల సినిమా కథ, కథనం ఒక లైన్‌ మీదే ఉంటాయి. ఇక్కడ దర్శకుడు అరివళగన్‌ అటువంటి రొటీన్‌ ఫార్ములా తీసుకోలేదు. ఇన్వెస్టిగేషన్‌తో మొదలైన కథను ఎంగేజింగ్‌గా చెప్పాడు. ప్రథమార్థం అంతా చాలా కొత్తగా సాగుతుంది. ఫస్టాఫ్‌  ఒక యూనిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది. సినిమా నేపథ్యం, హీరో క్యారెక్టర్‌, స్ర్కీన్‌ప్లే ఆసక్తి కలిగిస్తాయి. ద్వితీయార్థంకు వచ్చేసరికి భావోద్వేగాలు,, గతం, రివేంజ్‌ ఇదంతా రొటీన్‌గానే అనిపించింది. సిమ్రన్‌ క్యారెక్టర్‌, 42 మంది పిల్లలు చనిపోవడం, ట్విస్ట్‌లు రివీల్‌ కావడం ఇవన్నీ కూడా సోసోగా అనిపిస్తాయి. లాజిక్‌గా ఆలోచిస్తే కాస్త కొంత కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ అవుతుంది. (Sabdham Movie Review)




నటీనటులు విషయానికొస్తే.. వ్యోమ వైద్యలింగం పాత్రలో ఆది పినిశెట్టి పర్ఫెక్ట్‌గా ఫిట్‌ అయ్యారు. నటుడిగా ఎక్కడా పేరు పెట్టడానికి లేదు. స్టైలిష్‌గా కనిపించాడు.  లక్ష్మీ మీనన్‌ది రెగ్యులర్‌ క్యారెక్టర్‌ కాకుండా కొత్తగా ట్రై చేశారు. ప్రీ ఇంటర్వెల్‌ నుంచి ఇంటర్వెల్‌ సీన్‌లో ఆమెపై వచ్చే సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. నటన పరంగా అద్భుతంగా చేసింది. సెకెండాఫ్‌లో సిమ్రాన్‌ కనిపిస్తుంది. డయానా పాత్రకు న్యాయం చేసింది. లైలా నాన్సీ డేనియల్‌గా కనిపించింది. ఎందుకో ఆ పాత్రకు ఆమె సెట్‌ కాలేదనిపిస్తుంది. రిడిన్‌ కింగ్‌స్లే అక్కడక్కగా నవ్వించాడు. అతని మాటల్లో డబుల్‌ మీనింగ్స్‌ ఎక్కువ ఉన్నాయి. .క్లైమాక్స్‌ ఇంకాస్త ఎఫెక్టివ్‌గా చేసుంటే బావుండేది. ఇక ఈ సినిమాకు మెయిన్‌ ఎసెట్‌ తమన్‌ అందించిన సంగీతం.  నేపథ్య సంగీతం సినిమాను ముందుకు తీసుకెళ్లింది.  ప్రతి సీన్‌ హైలైట్‌ అయ్యేలా... భయానికి గురయ్యేలా తమన్‌ ఆర్‌ఆర్‌ ఉంది. కెమెరా వర్క్‌ చాలా బావుంది. హారర్‌ సినిమాకు కావలసిన లైటింగ్‌ కరెక్ట్‌గా కుదిరింది.  నిర్మాణ విలువలు తగ్గలేదు. వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బావుండేది. ఆది, అరివళగన్‌ కకలయికలో వచ్చిన వైశాలి సినిమా సూపర్‌ హిట్‌. మళ్లీ చానాళ్ల తర్వాత వారి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కాబట్టి అంచనాలున్నాయి. అయితే ఆ స్థాయిలో సినిమా లేదు కానీ.. బోర్‌ కొట్టకుండా ముందుకు తీసుకెళ్తుంది అంచనాలు లేకుండా సినిమా చూస్తే థ్రిల్‌ కావడం పక్కా.

ట్యాగ్‌లైన్‌: రీసౌండ్‌ థ్రిల్లర్‌..

Updated Date - Feb 28 , 2025 | 09:17 AM