Tollywood: సమ్మర్ వార్ లో కుర్ర హీరోలు
ABN , Publish Date - Mar 17 , 2025 | 06:17 PM
వేసవి కానుకగా రాబోతున్న రెండు యంగ్ హీరోస్ మూవీ ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ 'జాక్' మూవీ ఏప్రిల్ 10న వస్తుంటే... ప్రదీప్ మాచిరాజు సినిమా 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి' ఏప్రిల్ 11న జనం ముందుకు వస్తోంది.
వేసవి సెలవులు వస్తుండటంతో ఇక బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి ఊపందుకోనుంది. మార్చి నెలాఖరు నుంచే వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండగా.. ఏప్రిల్‌లో ఆసక్తికరమైన పోటీ ఎదురుకానుంది. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), మరో యువ నటుడు ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) ఒకరి తర్వాత మరొకరు వార్‌లోకి దిగబోతున్నారు. సిద్దు నటిస్తున్న 'జాక్' (Jack) ఏప్రిల్ 10న, ప్రదీప్ మాచిరాజు నటించిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ఏప్రిల్ 11న విడుదల కానున్నాయి... దీంతో ఈ పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో అన్న అంశం ఆసక్తిగా మారింది.
'టిల్లు స్క్వేర్' (Tillu Square) తో 100 కోట్ల క్లబ్‌లో చేరిన సిద్ధు జొన్నలగడ్డ 'జాక్' తో మరో హిట్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. 'బొమ్మరిల్లు' (Bommarillu) భాస్కర్ దర్శకత్వం, 'బేబీ' (Baby) ఫేమ్ వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తుండటంతో యూత్‌లో క్రేజ్ నెలకొంది. పైగా ఇప్పటికే విడుదలైన ఓ సాంగ్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ప్రమోషన్ కంటెంట్ కూడా సినిమాపై అంచనాలు పెంచడంతో ఈ మూవీ కోసం యూత్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాతో హీరోగా అలరించిన ప్రదీప్.. ఈసారి రూరల్ లవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వస్తున్నాడు. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్. ఇప్పటికే రిలీజైన పాటలు మ్యూజిక్ లవర్స్ ను మెప్పించాయి. దీంతో ఇద్దరు హీరోలకు పాత మేజిక్ రిపీట్ అవుతుందా లేదా అన్న క్యూరియాసిటీ పెంచుతోంది.
ఇదిలా ఉంటే రెండు సినిమాల మేకర్స్ తమ చిత్రాలపై గట్టి నమ్మకంతో ఉన్నారు. 'డీజే టిల్లు'తో యూత్‌లో స్ట్రాంగ్ బేస్ వేసుకున్న సిద్దు.. ఈసారి కూడా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ తో వస్తుండటం వల్ల.. తప్పకుండా 'జాక్' ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇక గత మూవీ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' సినిమాలాగే అక్కడ 'అమ్మాయి ఇక్కడ అబ్బాయి' గ్రామీణ నేపథ్యంలో రూపొందడంతో ఈ లవ్ స్టోరీ ఆకట్టుకుంటుందని మేకర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు వేర్వేరు బ్యాక్ డ్రాప్స్ తో వస్తున్నప్పటికీ వెంటవెంట రిలీజ్ డేట్స్‌తో పోటీ పడుతున్నాయి. రెండూ హిట్ అయితే ఎవరికీ నష్టం లేదు... ఒకవేళ ఈ రెండింటిలో ఏది కాస్తంత అటూ ఇటూగా ఉన్నా మరో దానికి అది కలిసి వచ్చే అంశం. ప్రస్తుతానికి అప్పర్ హ్యాండ్ లో ఉన్న సిద్ధుతో ప్రదీప్ కనీసం సమానంగా హిట్ కొడతాడేమో చూడాలి.
Also Read: RRR: ఏఐ రేపిన రచ్చ... 'ట్రిపుల్ ఆర్'పై మళ్ళీ చర్చ...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి