నాలో ఏదో మొదలైందని...

ABN , Publish Date - Mar 27 , 2025 | 03:35 AM

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సంతాన ప్రాప్తిరస్తు’. సినిమా మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ‘నాలో ఏదో మొదలైందనీ.. నీ చెలిమే రుజువైందని..’ అంటూ...

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘సంతాన ప్రాప్తిరస్తు’. సినిమా మ్యూజిక్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ‘నాలో ఏదో మొదలైందనీ.. నీ చెలిమే రుజువైందని..’ అంటూ సాగే పాటను బుధవారం విడుదల చేశారు. శ్రీజో రాసిన ఈ పాటను దినకర్‌, అదితి పాడారు. సునీల్‌ కశ్యప్‌ స్వరాలు అందించారు. విక్రాంత్‌, చాందినీ చౌదరిపై ఈ పాట చిత్రీకరించారు. ఈ సందర్భంగా హీరో విక్రాంత్‌ మాట్లాడుతూ ‘చాలా ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమాకు పని చేశాం. ‘నాలో ఏదో’ పాట అద్భుతంగా ఉంటుంది. ఈ పాటను మీరంతా ఎంజాయ్‌ చేస్తారు’ అని చెప్పారు.


నిర్మాత మధుర శ్రీధరరెడ్డి మాట్లాడుతూ ‘మా సంస్థకు సునీల్‌ గుర్తుండిపోయే పాటలు ఎన్నో ఇచ్చారు. అలాగే ‘నాలో ఏదో..’ పాట కూడా టాప్‌ టెన్‌ ఛాట్‌ బస్టర్స్‌లో ఉంటందని నా నమ్మకం’ అన్నారు. ‘హీరో హీరోయిన్ల లవ్‌జర్నీని చూపించే పాట ఇది. మ్యూజిక్‌ లవర్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ప్రస్తుత సమాజంలోని ఒక సమస్యను తీసుకుని యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘సంతాన ప్రాప్తిరస్తు’ చిత్రాన్ని రూపొందించాం’ అని చెప్పారు దర్శకుడు సంజీవ్‌రెడ్డి.

Updated Date - Mar 27 , 2025 | 03:35 AM