శక్తిమంతమైన పాత్రలో...
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:15 AM
విజయ్‌సేతుపతి కథానాయకుడిగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా...
విజయ్‌సేతుపతి కథానాయకుడిగా పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇటీవలె ఈ ప్రాజెక్ట్‌లోకి టబు ఎంటర్ అయ్యారు. తాజాగా, ఈ సినిమాలో ఓ శక్తిమంతమైన పాత్రను కన్నడ నటుడు విజయ్‌కుమార్ పోషించనున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘వీరసింహా రెడ్డి’ సినిమా తర్వాత ఆయన నటించనున్న రెండో తెలుగు సినిమా ఇది. రెగ్యులర్ షూట్‌ను జూన్ నుంచి మొదలుపెడుతున్నారు.