పూరి మార్క్‌తో
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:36 AM
విభిన్నమైన.. విలక్షణమైన పాత్రలతో జాతీయ స్థాయిలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. కొత్తదనం నిండిన కథలతో అలరించే దర్శకుడు పూరి జగన్నాథ్. ఇప్పుడు వీరిద్దరి కలయికలో...
విభిన్నమైన.. విలక్షణమైన పాత్రలతో జాతీయ స్థాయిలో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. కొత్తదనం నిండిన కథలతో అలరించే దర్శకుడు పూరి జగన్నాథ్. ఇప్పుడు వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రాబోతోంది. చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. ‘ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ పవర్‌ఫుల్ కథను రాశారు. ఆయన తనదైన శైలిలో తెరకెక్కించనున్నారు. నటుడిగా విజయ్ సేతుపతిలోని కొత్త కోణాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. జూన్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అని యూనిట్ తెలిపింది. చార్మీ కౌర్‌తో కలసి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు.