సరికొత్త పాత్రలో విక్కీ కౌశల్
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:37 AM
‘ఛావా’లో శంభాజీ పాత్రలో నటించి మెప్పించిన విక్కీ కౌశల్ ఈసారి ఇంద్రజాలంతో ప్రేక్షకులను మైమరిపించేందుకు సిద్ధమవుతున్నారు...
‘ఛావా’లో శంభాజీ పాత్రలో నటించి మెప్పించిన విక్కీ కౌశల్ ఈసారి ఇంద్రజాలంతో ప్రేక్షకులను మైమరిపించేందుకు సిద్ధమవుతున్నారు. శూజిత్ సిర్కార్ దర్శకత్వంలో ‘ఏక్ జాదూగర్’ అనే హిందీ చిత్రంలో విక్కీ కౌశల్ మెజీషియన్‌గా నటిస్తున్నారు. రైజింగ్ సన్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆదివారం ఈ సినిమా నుంచి చిత్రబృందం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసింది. మెరుస్తున్న ఆకుపచ్చని దుస్తులతో ఇంద్రజాలికుని వేశంలో ఉన్న విక్కీ కౌశల్ లుక్ అదిరిపోయింది.