Daggubati Venkatesh : మంచి చిత్రంతో సంక్రాంతికి వస్తున్నాం

ABN , Publish Date - Jan 13 , 2025 | 04:13 AM

వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించారు.

వెంకటేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించారు. ఈ నెల 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన బ్లాక్‌బస్టర్‌ మ్యూజికల్‌ నైట్‌ ఈవెంట్‌లో వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘సంక్రాంతికి మంచి చిత్రంతో వస్తున్నాం. నా అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా అమితంగా నచ్చుతుంది. ఆధ్యంతం నవ్వులు పంచుతుంది. ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించారు’ అని అన్నారు. ‘దిల్‌రాజు, శిరీష్‌ గారు అద్భుతమైన మద్దతు అందించారు. మా కలయికలో మరో బ్లాక్‌బస్టర్‌ రాబోతోంది. వెంకటేశ్‌గారితో హ్యాట్రిక్‌ విజయం అందుకోవడం ఖాయం’ అని అనిల్‌ రావిపూడి చెప్పారు. ‘అందరూ ఎంజాయ్‌ చేసేలా అనిల్‌ సినిమాను తీర్చిదిద్దాడు, సంక్రాంతికి ఘన విజయం అందించండి’ అని దిల్‌రాజు కోరారు.

Updated Date - Jan 13 , 2025 | 04:13 AM