సవాల్ చేయకు చంపేస్తా
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:05 AM
కుమార్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘శివంగి’. దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వంలో నరేశ్‌బాబు పి. నిర్మించారు. ఈ నెల 7న విడుదలవుతోంది...
ఆనంది, వరలక్ష్మి శరత్
కుమార్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన చిత్రం ‘శివంగి’. దేవరాజ్ భరణి ధరన్ దర్శకత్వంలో నరేశ్‌బాబు పి. నిర్మించారు. ఈ నెల 7న విడుదలవుతోంది. శనివారం చిత్రబృందం ‘శివంగి’ ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగింది. ‘సత్యభామరా... సవాల్ చేయకు చంపేస్తా’ అంటూ ఆనంది చెప్పిన డైలాగ్ ఆమె పాత్ర ఎంత శక్తిమంతంగా ఉండబోతోందో తెలిపింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ పోలీస్ పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్.
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి