మేలో భూల్ ఛుక్
ABN , Publish Date - Mar 27 , 2025 | 03:37 AM
అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ ‘గూఢచారి 2’తో కథానాయికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు బాలీవుడ్ భామ వామికా గబ్బి...
అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ ‘గూఢచారి 2’తో కథానాయికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు బాలీవుడ్ భామ వామికా గబ్బి. అయితే ఈ లోపులో ఓ హిందీ చిత్రంతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు వామిక. రాజ్‌కుమార్ రావుకు జోడీగా వామిక నటించిన ‘భూల్ ఛుక్ మాఫ్’ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు యూనిట్ బుధవారం తెలిపింది. ఈ సందర్భంగా మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ రొమాంటి క్ కామెడీకి కరణ్ శర్మ దర్శకుడు. వారాణసి నేపథ్యంలో సాగే ఓ మంచి ప్రేమకథతో ముడిపడిన చిత్రమిది. ‘ఛావా’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన మడ్డోక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం అంచనాలను పెంచింది.