మరింత చేరువవుతా వైష్ణవి చైతన్య

ABN , Publish Date - Apr 01 , 2025 | 01:38 AM

‘బేబీ’ ఫేమ్‌ వైష్ణవి చైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. సిద్ధు జొన్నలగడ్డతో బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఆమె నటించిన ‘జాక్‌’ ఈ నెల 10న విడుదలవుతోంది. అలాగే, ఆనంద్‌ దేవరకొండతో...

‘బేబీ’ ఫేమ్‌ వైష్ణవి చైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. సిద్ధు జొన్నలగడ్డతో బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో ఆమె నటించిన ‘జాక్‌’ ఈ నెల 10న విడుదలవుతోంది. అలాగే, ఆనంద్‌ దేవరకొండతో ఓ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా, ‘జాక్‌’ సినిమా ప్రమోషన్స్‌లో మీడియాతో ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఆమె. ‘‘ఇప్పటివరకూ అన్నీ సీరియస్‌ పాత్రలే చేశాను. ‘జాక్‌’లో డ్యూయల్‌ రోల్‌ పోషించాను. ఇందులో ఓ పాత్ర చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఈ చిత్రంతో కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువవుతాను’’ అని చెప్పారు.

Updated Date - Apr 01 , 2025 | 01:38 AM