కథే ఈ సినిమాకు హీరో
ABN , Publish Date - Apr 17 , 2025 | 02:30 AM
శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్.బి.శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘45’. అర్జున్ జన్యా దర్శకత్వంలో ఉమా రమేశ్ రెడ్డి, ఎం.రమేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు...
శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్.బి.శెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘45’. అర్జున్ జన్యా దర్శకత్వంలో ఉమా రమేశ్ రెడ్డి, ఎం.రమేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో సరికొత్త కథనాన్ని చూస్తారు. కథే ఈ సినిమాకు హీరో’’ అని చెప్పారు. ‘‘అందర్నీ మెప్పించే అంశాలున్న సినిమా ఇది’’ అని హీరో ఉపేంద్ర చెప్పారు. ‘‘వాణిజ్యాంశాలు ఉంటూనే కొత్తదనాన్ని పంచే చిత్రమిది’’ అని దర్శకుడు అర్జున్ జన్యా తెలిపారు.