6 Journey Movie: విభిన్న తరహా ప్రేమకథ

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:07 AM

రవిప్రకాశ్‌ రెడ్డి, సమీర్‌ దత్త, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన "6 జర్నీ" సినిమా ఈ నెల 25న విడుదల అవుతోంది. ఇది ఒక విభిన్న తరహా ప్రేమకథగా రూపొందించిన చిత్రం అని దర్శకుడు బసీర్‌ అలూరి తెలిపారు

రవిప్రకాశ్‌ రెడ్డి, సమీర్‌ దత్త, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘6 జర్నీ’. బసీర్‌ అలూరి దర్శకత్వంలో పాల్యం రవిప్రకాశ్‌రెడ్డి నిర్మించారు. ఈ నెల 25న సినిమా విడుదలవుతోంది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బసీర్‌ మాట్లాడుతూ ‘‘సినిమా తప్పకుండా అందర్నీ మెప్పిస్తుంది’’ అని అన్నారు. ‘‘ఇదో విభిన్న తరహా ప్రేమకథ గల చిత్రం’’ అని హీరో సమీర్‌ దత్త చెప్పారు.

Updated Date - Apr 22 , 2025 | 04:08 AM