Allu Arjun: అట్లీ మూవీలో ముగ్గురు హీరోయిన్లు
ABN , Publish Date - Apr 26 , 2025 | 06:45 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ సినిమా అలా స్టార్ట్ అయిందో లేదో... అప్పుడే పెద్ద సమస్య వచ్చిపడింది. బన్నీకి జోడీగా ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలు చేస్తున్నారని మొన్నటి వరకూ సంబరపడ్డ ఫ్యాన్స్ ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. ఎవరిని పెట్టినా సరేకానీ.. ఆ బ్యూటీ మాత్రం వద్దంటే వద్దని తెగేసి చెప్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) 'పుష్ప' (Pushpa) తో పాన్ ఇండియా రేంజ్ లో బ్రాండ్ గా మారిపోయాడు. బన్నీ నుంచి సినిమా వస్తుందంటే చాలు మూవీలవర్స్ ఫోకస్ పెరిగిపోతోంది. రీసెంట్ గా అట్లీ (Atlee) తో మూవీ ప్రకటించగానే... అందరి చూపు స్టోరీ లైన్ పై పడింది. అనౌన్స్ మెంట్ వీడియోతోనే సంచనాలకు కేరాఫ్ గా మారింది ఈ కాంబో. శాంపిల్ గా వదిలిన వీడియోలో మూవీ పీరియడ్ డ్రామాగా, భారీ బడ్జెట్, విజువల్ ట్రీట్ ఉంటుందని అంచనాకు వచ్చేశారు. కట్ చేస్తే ఇప్పుడు హీరోయిన్ల గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే అల్లువారబ్బాయి కోసం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ముద్దుగుమ్మలు రంగంలోకి దిగుతున్నారట.
అట్లీతో చేయబోయే మూవీలో అల్లు అర్జున్ డబుల్ రోల్ లో కనిపించనున్నాడట. అందులో ఒకటి నెగటివ్ షేడ్స్ తో ఉంటుందని ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాల తరహాలో ఈ మూవీ ఉండనుందట. బన్నీ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రేంజ్ లో అల్లు అర్జున్ ను చూపించబోతున్నాడట అట్లీ. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియస్ సెట్స్, ఇంటర్నేషనల్ స్టైల్ మేకింగ్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందట. అందుకోసం హాలీవుడ్ మేకర్స్ ను రంగంలోకి దింపనున్నారు. అయితే బన్నీతో ముగ్గురు ముద్దుగుమ్మలు రొమాన్స్ చేయనున్నారట. ఇప్పటికే మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ను ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ముంబైలో బ్యూటీకి టెస్ట్ లుక్ కూడా జరిగిందని... అనుకున్న క్యారెక్టర్ కు కరెక్ట్ గా మ్యాచ్ కావడంతో ఫైనల్ చేశారట. ఈ విషయం తెలిసిన బన్నీ ఫ్యాన్స్ మృణాల్ వద్దంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట. బన్నీ పక్కన మృణాల్ సూట్ కాదని... పైగా ఫేస్ లో ఎప్పుడు ఒకే ఎక్స్‌ప్రెషన్ ఉంటుందని... మరో హీరోయిన్ ను చూడమంటూ పోస్టులు పెడుతున్నారట. ఈ బ్యూటీతో పాటు ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి
కాస్టింగ్ పరంగా బన్నీ, అట్లీ మూవీ సంచలనాన్ని సృష్టించేలా కనిపిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో బన్నీ కోసం కాస్త బాలీవుడ్ ఫ్లేవర్‌ను సైతం యాడ్ చేయాలనుకుంటున్నారట. అప్పుడే గ్లామర్ తో పాటు కావాల్సిన బజ్ క్రియేట్ అవుతుందని అంచనా వేస్తున్నారట. అందుకోసం జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) తో పాటు దీపికా పదుకొణే (Deepika Padukune) ను అనుకుంటున్నారట. ఇప్పటికే జాన్వీతో చర్చలు జరపగా... బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని... దీపికా రిప్లై కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు ఫిక్స్ అవ్వగానే... జులై చివరి వారం లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ లో షూట్ కి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి బడ్జెట్ లోనే కాదు... హీరోయిన్ల విషయంలో నెక్ట్స్ లెవల్ ప్లానింగ్ తో ముందుకు సాగుతున్నాడు అట్లీ. సెట్స్ పైకి వెళ్లక ముందే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ప్రాజెక్ట్. మరి ఈ సినిమాలో బన్నీ పక్కన చిందులేసే భామలెవరో చూడాలి.
Also Read: Ram Pothineni : ఆ ఇద్దరిపై రామ్ ఆశలు
Also Read: Chiranjeevi : 35 సంవత్సరాల తర్వాత త్రీడీలో చిరు మూవీ
Also Read: Sunil: తమిళ రాజకీయ నాయకుడిగా సునీల్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి