ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు
ABN , Publish Date - Jan 08 , 2025 | 02:51 AM
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించారు....
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. కిరణ్ తిరుమల శెట్టి దర్శకత్వంలో బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించారు. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకాదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా హీరో ధర్మ మాట్లాడుతూ ‘ఈ సినిమాను ఆదరించడం ద్వారా చిత్ర పరిశ్రమలో యువ హీరోగా నాకో స్థానం కల్పించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. కొత్త వాళ్లకు ఇండస్ట్రీలో ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని మరోసారి రుజువైంది’ అని అన్నారు.