The Paradise: హ్యాట్రిక్ కాంబో.. మళ్లీ నాని సినిమాకు ఆ మ్యూజిక్ డైరెక్టరే..
ABN , Publish Date - Feb 02 , 2025 | 11:06 PM
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోబోతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫైనల్ అయ్యారు. ఇంతకు ముందు నానికి రెండు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఆల్బమ్స్ ఇచ్చిన సంగీత దర్శకుడితో నాని హ్యాట్రిక్ కి రెడీ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరి ‘దసరా’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ‘ది ప్యారడైజ్’ కోసం మరోసారి కొలాబరేట్ అయ్యారు. ఈ నూతన చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. హీరో నాని కూడా తన పాత్ర కోసం రెడీ అయ్యేందుకు ఇంటెన్స్‌గా జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ సెన్సేషనల్ అప్డేట్‌ని టీమ్ విడుదల చేసింది.
Also Read- Thandel: సంధ్య థియేటర్ ఎఫెక్ట్.. ‘తండేల్’ వేడుకకు నో ఎంట్రీ బోర్డ్..
ఆ అప్డేట్ మరేదో కాదు.. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్, రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా ఎంపికైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జెర్సీ, గ్యాంగ్‌లీడర్’ హిట్స్ తర్వాత నాని, అనిరుధ్ కలిసి పనిచేస్తున్న మూడవ చిత్రమిది. వారు చేసిన గత రెండు సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలవడంతో ఇప్పుడీ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా వున్నాయి. అనిరుద్ ఈ ప్రాజెక్ట్‌లో ఓకే అయినట్లుగా నాని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అనిరుద్ కూడా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని తెలియజేశారు.
‘‘మేము మా హ్యాట్రిక్ కోసం పని చేయబోతున్నాం. ఇదొక అద్భుతం అవుతుంది. ప్యారడైజ్ ఇప్పుడు N’Ani’Odela సినిమా. అనిరుద్‌కు స్వాగతం’’ అని నాని పోస్ట్ చేస్తే.. ‘‘ఇది నాకెంతో స్పెషల్. మై డియర్ నాని, శ్రీకాంత్ వెర్రిగా పోదాం’’ అని అనిరుద్ పోస్ట్ చేశారు. శ్రీకాంత్ ఓదెల పవర్ ఫుల్ లార్జర్ దెన్ లైఫ్ కథను ఇంటెన్స్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను రెడీ చేసినట్లుగానూ, ఇది నానిని పూర్తిగా కొత్త, మాస్-డ్రైవ్ అవతార్‌లో ప్రజెంట్ చేయనుందని తెలుస్తోంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్‌లో నిర్మించనున్నారు. ఈ చిత్రం ఇప్పటివరకు నాని యొక్క మోస్ట్ హై బడ్జెట్ వెంచర్‌గా తెరకెక్కనుంది.